14, ఆగస్టు 2020, శుక్రవారం

పుట్టినరోజు అంటే ఏమిటి?

పుట్టినరోజు అంటే ఏమిటి? తల్లిదండ్రులు కు లేకలేక పుడతారు పిల్లలు, కొంతమంది పిల్లలు కోసం ఎంతో పరితపిస్తూ ఉంటారు. మన పెద్దలు ఒక సామెత చెప్పారు. అది ఏమిటంటే పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని, ఇక్కడ మనము దానం కొద్ది బిడ్డలు అన్నారు కదా! మరి పిల్లలు పుట్టిన తర్వాత వారి పుట్టిన రోజులు మనము ఎలా జరుపుతున్నాము. మన పుట్టిన రోజులు ఎలా జరుపుకుంటున్నాము. అనే విషయం ఆలోచించితే, మన భారత దేశాన్ని పరిపాలించిన ఇంగ్లీషు వారి సంస్కృతి ని వదల లేక పోతున్నాము. ఎందుకంటే వాళ్ళు క్రొవ్వొత్తి లు పెట్టి దీపాలు అర్పుతారు పుట్టిన రోజులు కు, వాళ్ల ది దీపాలు ఆర్పే సంస్కృతి. మనది దీపాలు వెలిగించే సంస్కృతి. కొడుకు గానీ కూతురు గానీ పుడితే ఆ తల్లిదండ్రుల ఆనందము వర్ణనాతీతం. ఎందుకంటే వాళ్ల ముఖములో ఎంతో ఆనందము కనబడుతుంది. మరి పిల్లాడు పుట్టిన తర్వాత మనము కేక్ కట్ చేస్తున్నామా! లేదే? 11వరోజున గానీ 21వరోజున గానీ మనము పిల్ల వానికి చక్కగా సున్నిపిండి తో నలిచి కుంకుడుకాయ గానీ షీకాయ గానీ వాటితో తల అంటుతున్నాము, బ్రాహ్మణులుని పిలిచి వానికి నామకరణం చేస్తున్నాము. ఆ విధంగా ప్రతీ పుట్టిన రోజు ఎందుకు అలా చెయ్యరూ!వాళ్ల కు మన సంస్కృతి సంప్రదాయాలను నేర్పించండి చిన్న తనము లోనే, ఒరేయ్ మనము హిందువులుము రా మనం ఆంగ్లేయులము కాదు. కేక్ ల సంస్కృతి వాళ్ల ది. చక్కగా మనము పుట్టిన రోజు నాడు తలంటు కొని క్రొత్త బట్టలు కట్టుకొని,, కన్న తల్లిదండ్రులు దగ్గర ఇంట్లో ఉన్న తాతనానమ్మ ల దగ్గర ఆశీర్వచనము తీసుకుని, ఏదైనా దేవాలయము నకు వెళ్లి ఆ దేవుని దగ్గర తన పేరు మీద గోత్ర నామములు తో పూజ చేయించుకొని ఆశీర్వచనము తీసుకుని, ఇంటికి వచ్చి పాయసము త్రాగాలి రా! అని మనము చిన్న తనము నుంచి మార్పుతీసుకొని వస్తే వాడు పదిమందిని మారుస్తాడు. కాబట్టి తల్లిదండ్రులారా! మీరు మారండి మీ పిల్లలు ను మార్చండి. అప్పుడే మన సంస్కృతి బాగుంటుంది.

*********************

కామెంట్‌లు లేవు: