12, సెప్టెంబర్ 2020, శనివారం

మంచి గ్రహా స్థితి ఉందని చెపుతున్నారు*_

*పండితుల సలహా ప్రకారం 13 వ తారీఖు న ఒక మంచి గ్రహా స్థితి ఉందని చెపుతున్నారు*_

13/09/2020 ఆదివారం ఉదయాన 10:45 నుండీ 11:45 మధ్య:

లగ్నం - అనూరాధ 2 - వృశ్చిక
రవి - సింహం - భావం 10 - స్వక్షేత్రం
చంద్ర - కర్కా - భావం 9 - స్వక్షేత్రం
కుజ - మేష - భావం 6 - స్వక్షేత్రం
బుధ - కన్య - భావం 11 - ఉచ్ఛ
గురు - ధను - భావం 2 - స్వక్షేత్రం
శుక్ర - కర్క - భావం 9 - శత్రు
శని - మకర - భావం 3 - స్వక్షేత్రం
రాహు - మిధున - భావం 8 - సమ
కేతు - ధను - భావం 2 - సమ

*మంచి ముహూర్తం అని చెపుతున్నారు,*

_ఆ గంట కాలం కనుక, ప్రతీ ఒక్కరూ రెండు జిల్లేడు ఆకులపై గోధుమలు ఉంచి, మట్టి ప్రమిద లో రెండు వత్తులు వేసి దీపారాధన చేసి,... దైవారాధన లో నిమగ్నమై ఉండడం మంచిది అని చెపుతున్నారు_

*చేసిన ప్రతీ ఒక్కరికీ శుభమే జరుగుతుంది...*

🙏సర్వే జనా సుఖినోభవంతు🙏
మన ప్రియతమ సభ్యుడు శ్రీ వై. ఎన్. వి. ఎల్. నరసింహారావు గారు, డాక్టర్ వడ్లమాని రవిసుందర్ గారు ప్రసంగించిన ఈ ఆడియోలో ఇక రాబోవు 250 సంవత్సరాలకు కూడా రానటువంటి ఒక అద్భుతం 13.9. 2020 ఆదివారం ఉదయం 10-45 నుంచి 11-45 లోగా నవ గ్రహాలలో (రాహు, కేతు, శుక్ర, గ్రహాలు తప్ప, మిగిలిన) ఆరు ప్రధాన గ్రహాలు తమతమ స్వక్షేత్రాలో పూర్తిగా ఉండబోతున్నాయి అని తెలిపారు. అందు వలన కలిగే ఫలితాలు కూడా తెలిపారు.
         ఇటువంటి జ్యోతిశ్శాస్త్ర, ఫల సంబంధమైన కలయిక రాబోవు రెండు వందల యాభై సంవత్సరాలు పైగా కూడా చూడవీలు పడదేమోని, కనుక, 13.9 2020 ఆదివారం ఉదయం స్నానం చేసి,10-45 నుండి, 11-45 వరకు పూజ గది ముందు కూర్చుని, 2 జిల్లేడు ఆకుల పై గుప్పెడు గోధుములు పెట్టి, దానిపై మట్టి ప్రమిదలో ఆవు నేతి దీపం కానీ, నువ్వుల నూనె దీపం కానీ వెలిగించి, మీ ఇష్ట ఆరాధ్య దైవములను సంకల్ప పద్ధతిలో స్తుతించి, మీ మనసులో మీకు కావలసిన కోరికలను ఫలించినట్లు కోరుకొని, సఫలీకృతులు కావాలని కోరడమైనది.

       సంకల్పానికి, లలితా సహస్రనామం కానీ, విష్ణుసహస్రనామం కానీ,హనుమాన్ చాలీసా కానీ, వేరే మీ ఇష్ట దేవత నామస్మరణ కానీ, చేసిన, మీరు కోరిన ఫలితం దక్కుతుంది. ఈ సందర్భం మీ జీవితంలో మరెన్నడూ రాదు.

       ఒకవేళ మీకు పైన చెప్పిన దేవతల నా మావళి దొరకకపోతే,
సులభంగా ఈ క్రింది సూర్యభగవానుని సంకల్పమును జపించండి:-

" ఆదిత్యాది నవగ్రహానా,
అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు".
     
      పై చిన్న మంత్రమును పూజ జరిగే వరకు చెప్పాలి.

      తెలుగు లో ఉన్న ఈ ఆడియో ని ఒకటికి రెండు సార్లు వినండి. ఆయురారోగ్య సుఖశాంతులతో వర్ధిల్లండి.

లోకా సమస్తా సుఖినోభవంతు🕉️🙌

కామెంట్‌లు లేవు: