13, నవంబర్ 2020, శుక్రవారం

🙏 శివానందలహారీ 🙏 ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్దాం సగమనాం విచిత్రా0 పద్మాభ్యా0 ప్రతిదివస సన్మార్గఘటితామ్ స్మరారే ! మచ్చేత స్పుటపటకుటీ0 ప్రాప్య విశదాం జయ ! స్వామిన్ ! శక్త్యాసహ శివగణై స్సేవిత విభో ! సద్ధైర్య మనియెడి స్తంభాళి తోడను త్రయగుణ దేహ బంధములతోడ , స్వేచ్చాను గమనమై చిత్ర విచిత్రమై పద్మ సదృశ చిత్ర పంక్తి తోడ ప్రతిదిన చింతిత బ్రహ్మ భావము తోడ రాజ మార్గము నందు రక్తి తోడ నమలమౌ నాయొక్క యంత రంగంబను స్పుట పటపు కుటీర మిటను గలదు శంకరా ! నీవు పార్వతీ సహితు డగుచు నస్మదీయ కుటీరమ్ము నందు జొచ్చి సురిచిరానంద భోగాల చొక్కుమయ్య సకల గణ భక్తిసంసేవ్య సర్పభూష ! 21 # ప్రలోభాద్యై రర్థాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తస్స న్ర్భమతి బహుదా తస్కరపతే ! ఇమంచేతశ్చోరం కథ మిహ స హే శంకర ! విభో ! తవాFధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ అమిత ప్రలోభంబు ననయంబు పొందియు నర్థాప హరణంబు నాచరించ మచ్చిత్త మనియెడు మహితమౌ చోరుండు ధనికుల గృహముల దరిని జేర సతతంబు యత్నించి సంరంభ మొనరించు నడ్డు యాపును లేక యవధి లేక యీ చిత్తమను చోరు నేరీతి నిలిపుదు చెడు కార్యముల నెల్ల చేయకుండ చిత్త మనియెడి నీ చోరు శీఘ్రముగను పట్టి బంధించి నీ వశవర్తి జేసి పరమ నిర్దోషి నైనట్టి భక్తు నన్ను కరుణతోడుత రక్షించు కామదహన ! 22 # ✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

 🙏 శివానందలహారీ 🙏


ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్దాం సగమనాం

విచిత్రా0  పద్మాభ్యా0 ప్రతిదివస సన్మార్గఘటితామ్

స్మరారే ! మచ్చేత స్పుటపటకుటీ0 ప్రాప్య విశదాం

జయ ! స్వామిన్ ! శక్త్యాసహ శివగణై స్సేవిత విభో ! 



సద్ధైర్య మనియెడి స్తంభాళి తోడను

              త్రయగుణ దేహ బంధములతోడ ,

స్వేచ్చాను గమనమై చిత్ర విచిత్రమై

              పద్మ సదృశ చిత్ర పంక్తి తోడ 

ప్రతిదిన చింతిత బ్రహ్మ భావము తోడ

              రాజ మార్గము నందు రక్తి తోడ

నమలమౌ నాయొక్క యంత రంగంబను

              స్పుట పటపు కుటీర మిటను గలదు

శంకరా ! నీవు పార్వతీ సహితు డగుచు

నస్మదీయ కుటీరమ్ము నందు జొచ్చి

సురిచిరానంద భోగాల చొక్కుమయ్య 

సకల గణ భక్తిసంసేవ్య సర్పభూష !        21 #


ప్రలోభాద్యై రర్థాహరణ పరతంత్రో ధనిగృహే 

ప్రవేశోద్యుక్తస్స న్ర్భమతి బహుదా తస్కరపతే !

ఇమంచేతశ్చోరం కథ మిహ స హే శంకర ! విభో !

తవాFధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్ 



అమిత ప్రలోభంబు ననయంబు పొందియు

            నర్థాప హరణంబు నాచరించ

మచ్చిత్త మనియెడు మహితమౌ చోరుండు

             ధనికుల గృహముల దరిని జేర

సతతంబు యత్నించి సంరంభ మొనరించు

             నడ్డు యాపును లేక యవధి లేక

యీ చిత్తమను  చోరు నేరీతి నిలిపుదు

              చెడు కార్యముల నెల్ల చేయకుండ

చిత్త మనియెడి నీ చోరు శీఘ్రముగను

పట్టి బంధించి నీ వశవర్తి జేసి 

పరమ నిర్దోషి నైనట్టి భక్తు నన్ను

కరుణతోడుత రక్షించు కామదహన !         22 #


✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: