13, నవంబర్ 2020, శుక్రవారం

గర్భము ధరించు "తల్లి

 ఓ అర్జునా ! నానావిధములైన ఏ ప్రాణులు ఉత్పన్నమగుచున్నవో వాటినన్నంటిని ఈ "ప్రకృతి"యే గర్భము ధరించు "తల్లి".  నేను బీజముల స్థాపించు తండ్రిని. 

సత్వ (అరిషడ్వర్గముల యందు ఆసక్తి లేకుండుట) ,రజో (కోరికలయందు ఆసక్తి సదా కలిగియుండుట), తమో ( జన్మసాఫల్యము సిద్ధాంతము తెలియకుండుట) మూడు గుణములు ప్రకృతినుండి జనియించి అవినాశియైన జీవుడను శరీరములో బంధించుచున్నవి. సత్వగుణము నిర్మలమైనది, వికారరహితమైనది. సత్వగుణమువలన ఉద్భవించు సుఖములతో వాటి మీద అభిమానముచే జీవుని బంధించుచున్నది. రజోగుణమువలన కలుగు కోరికలాసక్తి వలన కర్మలచేత  మరియు ఫలముచేతను జీవుని బంధించుచున్నది. మోహకారకమగు తమోగుణము జీవాత్మను సోమరితనము, నిద్రాదులచే బంధించుచున్నది  (ADHYAYAMU 14TH)

కామెంట్‌లు లేవు: