13, నవంబర్ 2020, శుక్రవారం

రాజయోగము

 *ఆధ్యాత్మిక జీవనము*


*రాజయోగము*

మనస్సులో ఇంద్రియార్థాల గురించి వచ్చే ఆలోచనలను నిగ్రహించి, మనస్సును ఉన్నతమైన మార్గంలో పయనించేలా చేయడమే దీనిలోని ముఖ్యమైన సాధన. 


అత్యధిక సంఖ్యాకులకు ఇది ఒక అసంభవమైన అధ్భుత కృత్యం. ఈ సాధన చెయ్యడానికి ముందుగా శరీరాన్ని సమాయత్తం చేయాలి. అలా చెయ్యకుండా సాధన చేయడం వలన విపరీతమైన పరిణామాలు కలుగవచ్చును.


కాబట్టి యోగ శాస్త్ర నిర్మాతలలో ముఖ్యుడైన పతంజలి దీనిని క్రమంగా హెచ్చుతూ పోయే అనుక్రమణిక రూపంలో తయారుచేశాడు. సామాజికంగానూ, వ్యక్తిగతంగానూ *యమ, నియమ* అనే నైతిక విలువల అనుష్టానం మొదట్లో చేయాలి.


అహింస, సత్యపాలన, బ్రహ్మచర్యం, అస్తేయం, అపరిగ్రహం అనే విలువలను ఎల్లప్పుడూ పాటించాలి. శారీరక, మానసిక పరిశుభ్రతలను పాటిస్తూ, ఆత్మ సంతృప్తితో మన మీద మనం ఆధారపడడాన్ని నేర్చుకోవాలి.  


ఆధ్యాత్మిక గ్రంథపఠనం, అలా పఠించిన భావాలను చింతన చేసి జీర్ణించుకోవడం, కర్మఫలాలను సంపూర్ణంగా భగవదర్పితం చేయడం సాధన చేయాలి.


*శుభంభూయాత్*


వివేక, వైరాగ్య, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం అనే సాధన చతుష్టయ సంపత్తి గలవాడే బ్రహ్మవిద్యకీ అర్హుడు

సాధనా చతుష్టయం సామ్యమెఱిగి వింతలన్నీ మదిలోన విడచినపుడే మంతనంబగు గురుభక్తి మహిమయగును


పరిపూర్ణ /పరబ్రహ్మ/ పరమాత్మ నామరూపాలు గుణధర్మాలు లింగబేధాలు షడ్వికారాలు లేనిది.


ధర్మ సంస్థాపనకై (జివోద్ధరణకై) యోగమాయచే ఒకరూపంతో అవతరించును .


 అవతరించిన రూపమే పరమాత్మ అని భ్రమపడరాదు


 అవతారాల వెనకున్న మహాచైతన్యం పరమాత్మ. అటువంటి పరమాత్మ తత్వమనేది సుక్స్మాతి సూక్ష్మమైనది, అవజ్ఞమానస గోచరమైనది, మాటలకి, మహిమాలకి, మాయలకి అందనిది. కేవలం నిర్వికల్ప సమాధిలో, స్వానుభవంలోనే అవగతమవుతుంది తప్ప అన్యధా అసాధ్యం .


సకల విద్యల సిద్ధాంతాల సారము గమ్యము పరమాత్మ నిత్యసత్యమై ఉన్నకాని, ఏమి లేనిది పరమాత్మ సర్వము తానైనది పరమాత్మ

 ఆత్మస్వరూపమైనది పరమాత్మ


తెలియనంత వరకే బ్రహ్మవిద్య.     

  తెలిసిపోతే కోతివిద్యా. తెలుసుకుంటే బ్రహ్మవిద్య. లోకవాసన దేహవాసనలూ తొలగును అవిద్య తెలియకపోతే బ్రహ్మవిద్య వృధాయే లోకవిద్య. స్వానుభూతి చెందితే బ్రహ్మవిద్య బ్రహ్మమే తానై

బ్రహ్మవిత్ బ్రహ్మెవ భవతి

 బ్రహ్మానందం కలుగును .


నోటిద్వారం ప్రపంచం ముక్కు ద్వారం పరమపదం తన్ను తానెరగడమే బ్రహ్మవిద్య.

 బ్రహ్మవిద్యని ఎరిగినవాడే వివేకధనవంతుడు బ్రహ్మవిద్యని ఎరగనివాడే అజ్ఞానబీదవాడు ఉన్నదొక్కటే బ్రహ్మము. అదే నిత్యసత్యము.

 లేని యెరుకే జీవజగదీశులు, సృష్టి స్థితి లయాలు.


 గాఢనిద్రలో దేహేంద్రియ మనో బుద్ధులు పడిపోతాయి. ప్రారబ్దవశమున ఉదయం మేలుకోగానే లేస్తాయి. పగలంతా వాటిని వాడుకుంటూ తిరిగి మళ్ళీ రాత్రవగానే పడేస్తాం. ఒకరోజు లేవకుండా పొతే అదే మరణం. జననం మరణం అనేవి

 దేహానికి మాత్రమే నీ స్వరూపమైన కేవలమైన ఆత్మకి జననమరణాలు లేవు.

 నజాయతే మ్రియతే

  అది పుట్టదు పెరగదు గిట్టదు వంటి షడ్వికారాలు లేనిది. దేహంలో ఉన్నా కానీ దేహాతీతమైనది. సూక్ష్మాతి సూక్ష్మా మైనది. అణువుకన్నా అణువు పరమాణువులాంటిది ఇంద్రియగోచరం కానిది . ఒకయోగి మాత్రమే దేహేంద్రియ మనో బుద్ధులను చక్కగా వాహనాన్ని నడిపే వాడిలాగా ఈ దేహేంద్రియ మనో బుద్ధులనే పరికరాలను ఎక్కడ ఏది వాడాలో దాన్ని వాడుకుంటూ వాటి అవసరం లేనపుడు పడేస్తాడు.


🌷🌷🕉🌷🌷🕉🌷🌷🕉🌷🌷🕉

కామెంట్‌లు లేవు: