13, నవంబర్ 2020, శుక్రవారం

విద్య

 *విద్య* మరియు *అవిద్య* 


👉 నారదమహర్షి ఎల్లప్పుడూ వీణను మీటుతూ విష్ణు నామాన్ని కీర్తిస్తూ ఉంటాడు. వీణ అంటే తంతులు లేదా తీగలు బిగించబడ్డ వాద్య పరికరం. విద్యా దేవత అయిన సరస్వతి కూడా వీణను ధరించి ఉంటుంది. ఆమెను 'వీణా పాణి' అని కూడా అంటారు. నేటికీ మన దేశంలో విద్యార్థులు సరస్వతీ దేవిని తమ విద్యాభివృద్ధి కోసం పూజిస్తారు.


👉 భక్తులు కూడా తమ ఆద్యాత్మిక ఙ్ఞానంతో ప్రగతిని సాధించడం కోసం సరస్వతిని - నారద మునిని సేవిస్తారు. 'సరస్వతి' అంటే 'ఙ్ఞానము' అని కూడా అర్థము. మన వైష్ణవాచార్యులలో ఒకరైన భక్తి సిద్ధాంత సరస్వతి.. ఙ్ఞానాన్ని సూచించే లాగా తన దీక్షా నామాన్ని స్వీకరించారు. ఙ్ఞానము రెండు విధాలుగా ఉంటుంది, అవిద్య మరియు విద్య.


👉 పరతత్త్వమును గుర్తించడానికి ఉపయోగపడేది నిజమైన విద్య దీనిని బ్రహ్మ - విద్య అంటారు. అది కాకుండా మనము నేర్చుకునే ఐహికమైన చదువులన్నిటినీ 'అవిద్య' అంటారు. దీని వలన వ్యక్తులు తాత్కాలిక ప్రయోజనాన్ని అందించే 

పేరు ప్రతిష్ఠలను, ఇంద్రియ తృప్తిని పొందగలుగుతారు. ఎందుకంటే...భౌతికమైన తృప్తిని పొందడానికి.. చాలా శ్రమ పడితేనే తప్ప వాళ్ళు ఆనందంగా ఉండలేరు. అందువలన అందరూ శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే యదార్థమైన ఙ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి.


 *ఓం నమఃశివాయ*

కామెంట్‌లు లేవు: