9, నవంబర్ 2020, సోమవారం

కంచి కామకోఠి పీఠాధిపతులు,* *ప్రాతఃస్మరణీయులు*

 *కంచి కామకోఠి పీఠాధిపతులు,* *ప్రాతఃస్మరణీయులు*


 *శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు* పశ్చిమ గోదావరి జిల్లా "తణుకు" వచ్చారు. అక్కడ ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానమంటే ధర్మానుష్ఠానమే అలా చేసేవాడు. ఆ బ్రాహ్మణుడికి పరమాచార్య స్వామిని దగ్గరగా చూడాలని కోరిక. రెండు రోజులు ఆయన విడిది వద్దకు వెళ్ళాడు. ఆ రెండు రోజులూ విపరీతమైన జనం. స్వామివారిని దూరం నుండే చూసి, ఆయన దగ్గరకు ఎలా వెళతాను, ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు, వెళ్ళడం అనవసరం అని, అక్కడి నుండే నమస్కరించి, ఇంటికి వెళ్ళి పడుకున్నాడు.


శ్రీమహాస్వామి వారు తెల్లవారుఝామున రెండు గంటలకు ఎవరికీ చెప్పకుండా బయలుదేరి, కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. *ఆయనకి ఇల్లు ఎలా తెలుసు* *అనకూడదు.* *ఆయన పరబ్రహ్మస్వరూపులు, త్రికాలవేది.* *"ఆయనకు తెలియనిది ఉండదు.* స్వామివారు ఆ బ్రాహ్మణుడి ఇంటి వద్ద కూర్చుని జపం చేసుకుంటున్నారు.


ఆ బ్రాహ్మణుడి ఇల్లాలు కళ్ళాపి చల్లటానికి బయటకు వచ్చింది. కళ్ళాపి చల్లి పక్కకు చూస్తే మహాస్వామి వారు ఉన్నారు. ఆమె హడలిపోయింది. "నడిచే దేవుడు" అని పేరుగాంచిన వ్యక్తి, ప్రపంచంలో కోన్ని కోట్లమంది ఆయన పాదాలనుకూర్చొని తలచుకొని నమస్కరిస్తారు. అటువంటి ఆయన తన ఇంటి అరుగుమీద కూర్చుని ఉన్నారు. పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది. ఆ బ్రాహ్మణుడు నిద్రమంచం మీద నుండి దూకి బయటకు వచ్చి నేలమీద పడి నమస్కరించి ఏడుస్తూ, "మహానుభావా! మాదగ్గర కు ఇంటికి వచ్చారా?" అన్నాడు.

అప్పుడు మహాస్వామివారు "రెండు రోజులుగా నా దగ్గరకు వస్తున్నావుగా! ఈయన దగ్గరకు వెళ్ళగలనా, నన్ను పలకరిస్తారా అనుకున్నావు.


 *ధర్మానుష్ఠానం చేసేవారి* *దగ్గరకు నేను రాను* *అనుకున్నావు! అందుకే, నేనే* *వచ్చాను" అన్నారు.*


*"మహాత్ముల దృష్ఠిలోకి ఏదో చేస్తే వెళ్ళగలము"* *అనుకోకూడదు! ఏ మూల* *కూర్చుని ధర్మానుష్ఠానం* *చేస్తున్నా మహాత్ముల* *దృష్టిలోనికి వెళ్ళి తీరుతారు.* *సత్పురుషుల దృష్టిలో పడటం జీవితంలో* *గొప్ప అదృష్ణం"*

కామెంట్‌లు లేవు: