9, నవంబర్ 2020, సోమవారం

🙏శ్రీకృష్ణుడు వెన్న దొంగలించడం

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

🙏శ్రీకృష్ణుడు వెన్న దొంగలించడం లోనే ఆంతర్యం :

మనము పుట్టినప్పుడు పాల వలె శుద్ధ సత్వ స్వరూపముగా ఉంటాము. ఆ పాలు కుండలో పోయటం అనగా దేహము ధరించటమని అర్థము. పిడకల దావిలో పాలకుండను పెడితే ఎంతో నెమ్మదిగా సన్నటి సెగ మీద పెట్టి బాగా కాగుతాయి. ఎర్రటి రంగును సంతరించుకుని దట్టంగా మీగడ కట్టి కాగుతాయి. అనగా నిరంతరమూ సత్సంగంలో పాల్గొని గురుబోధను ఆచరణలో అనుభవిస్తుంటే దేహ సంబంధిత రుగ్మతలు పిడకలు కాలి బూడిద అయినట్లు అయిపోతాయి. సత్సంగ ప్రభావము వలన చిక్కగా, కమ్మగా పాలు తయారయినట్లు మనలో భావం తయారు అవుతుంది. ఇక పాలలో తోడు పెట్టినట్లు గురువు అనుగ్రహమును కలుపుకుంటే జ్ఞానము పెరుగు లాగా గట్టిపడుతుంది. ఆ పెరుగు అనే జ్ఞానంలో భక్తి అనే కవ్వం పెట్టి చిలుకుతుంటే దానిలోనుండి వెన్న వంటి మృదువైన పదార్థం తయారు అవుతుంది. దానిని తీసుకోవటానికి పరమాత్మ స్వయంగా వస్తాడు. అదే వెన్న దొంగలించడంలోని ఆంతర్యం. శ్రీ కృష్ణలీలలో ఎన్నో అన్వయాలు తెలుసుకుని వాటిని మన మాటలలో చెబుతూ మనను ఆనాటి కృష్ణ తత్వము అనుభవింప చేస్తున్న ప్రవచనకర్తలు ఎందరో ఉన్నారు. ఎన్ని వింటున్నా తాత్కాలికానందమే కానీ మహి మాన్విత్వమును అనుభవించటం అనేది ఎవరి పరిధిలో వారు అనుభవించవలసిందే. ఈనాటికీ స్మరించినంత మాత్రాన ఆనాటి వైభవము దృశ్యరూపంగా గోచరిస్తుంది.🙏

సేకరణ.

కామెంట్‌లు లేవు: