9, నవంబర్ 2020, సోమవారం

పిలిచేవాళ్ళు

 *పిలిచేవాళ్ళు పిలిస్తే వస్తా* 

🕉🌞🌎🌙🌟🚩


స్వామి వివేకానంద భారతదేశంలోని ఓ గ్రామంలో నుంచి నడిచి వెళ్తున్నాడు.

ఊరి బయట ఒక దేవాలయం ఉంది.

ఆ దేవాలయం విగ్రహం ధ్వంసమై ఉంది.

దేవాలయం కూల్చబడి ఉంది.

లోపలికి వెళ్ళాడు స్వామీజీ.

అమ్మవారు భవానీదేవి.

క్షీరభవానీ దేవి అంటారు ఆ ప్రాంతీయులు ఆమెను.

విగ్రహాన్ని చూసి స్వామీజీ...

అమ్మా!?

ఇతర మతస్థులు వచ్చి నీ దేవాలయాన్నిలా ధ్వంసం చేశారు.??

నీ విగ్రహాన్ని ముక్కలు చేశారు.??

నువ్వు ఎందుకు చూస్తూ ఊరుకున్నావు??

నువ్వందరినీ రక్షిస్తావని కదా!?దేవాలయాన్ని కట్టింది.!?

నిన్ను నీవే రక్షించుకోలేకపోతే ఎలా!??

ఇక మమ్మల్నేమి రక్షిస్తావు?

అన్నారు స్వామీజీ అమ్మవారితో.

అని కళ్ళు మూసుకుని బాధపడుతున్నాడు.

అమ్మవారు కనిపించిందాయనకు.!

పరమేశ్వరి సాక్షాత్కరించింది.

ఆమె అన్నది...నాయనా!

దేవాలయాన్ని నేను కట్టమన్నానా?!

మీరు కట్టుకున్నారు.!

మీరే రక్షించుకోవాలి.!

అంటే!??

ఆ సమాధానం సంతృప్తిగా లేదమ్మా?!

దేవాలయాన్ని మేము కట్టాము.

కానీ నువ్వు వస్తున్నావు కదా?!

మీరే రక్షించుకోండి అంటే?

నువ్వెందుకిక్కడ?

అన్నాడు స్వామీజీ.

అంటే!?

కాదు నాయనా!

*Divine Law is different from Human Law.* 

మేము జోక్యం చేసుకుంటే!?మా ముందు ఎవరాగుతారు?

ఈ ప్రపంచంలో?

కానీ...!

మేము కర్మ ఫలితాలనిస్తాము.

సరాసరి.,నేరుగా జోక్యం చేసుకోము.

దేవాలయం కట్టినవాడికి పుణ్యఫలితమిస్తాము.

దేవాలయం నాశనం చేసినవాడికి పాపఫలితమిస్తాము.

నరకాన్నిస్తాము.

అయితే!?

మీరెందుకున్నది?

మీరు రారా?

అని నువ్వడిగావు.

వస్తాము.

తప్పకుండా వస్తాము.

మమ్మల్ని పిలువగలవాడు పిలిస్తే వస్తాము!

పిలువగలగాలా?

మమ్మల్ని పిలిచేవాళ్ళు తక్కువైపోయారు.

నువ్వు పిలువగలిగేవాడవు గనుక వచ్చాను నేను.!

కనుక పిలువగలిగేవాళ్ళను తయారు చేయి.

వస్తే..అప్పుడు తప్పకుండా వస్తాము మేము.

అని ఆమె సమాధానం చెప్పింది క్షీరభవానీ దేవి వివేకానంద స్వామికి.

🐚🐚🐚🐚🐚🐚🐚🐚🐚

కామెంట్‌లు లేవు: