9, నవంబర్ 2020, సోమవారం

సమయస్ఫూర్తి

 🌹🌹 *సమయస్ఫూర్తి* 🌹🌹


అనగనగా ఒక ఊరిలో కోదండరామయ్య వనజ దంపతులు. వారికి లేక లేక ఒక కుమారై కలిగింది. వారు ఆమెకి భారతి అని పేరు పెట్టుకున్నారు. 


ఒక్కగానొక్క కూతురు కావటంతో ఎంతో గారాబంగా పెంచుకున్నారు. కొంతవరకు చదివించారు. తరువాత యుక్తవయస్సు రాగానే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. 


కూతురిని కాస్త తూగగలిగిన వారికి ఇవ్వాలని, కోడలిని కాస్త పేద ఇంటి నుండి తెచ్చుకోవాలని మన ఆర్యోక్తి. అలాగే కాస్త ఉన్నత కుటుంబాన్ని వెదకి జాలయ్య అనే అబ్బాయితో వివాహం జరిపించారు. అమ్మాయి కాపురానికి వెళ్లింది. కాలం గడిచిపోతున్నది. 


భారతిని పక్క ఊరిలోనే ఇచ్చారు. అక్కడికి తమ ఊరి వారు మజ్జిగ అమ్ముకునేందుకు ప్రతి రోజూ పోతుంటారు. భారతి ఇంట్లో కూడా మజ్జిగ పోస్తుంటారు.


మజ్జిగ వారితో మా అమ్మా,నాన్నను అడిగానని చెప్పండి. వారిని చూడాలని ఉంది. రోజూ కలలోకి వస్తున్నారు అంటూ ప్రతిరోజు చెప్పుకునేది భారతి.


 వారు వచ్చి అక్షరం వదలకుండా ప్రతిరోజు కోదండరామయ్యకు చెప్తుండేవారు. ఆ మాటలు విన్నప్పుడల్లా ఆయనకు మనస్సు బాధతో నిండిపోయేది. బాధ అధికమై తట్టుకోలేకపోయేవాడు.


అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కూతురును చూడటానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా కూతురి అత్తవారింటికి వెళ్లాడు. లేకలేక వచ్చిన వియ్యంకుడిని సాదరంగా ఆహ్వానించారు భారతి అత్తమామలు. 


తండ్రిని చూచి భారతి ఎంతో సంతోషించింది. భోజనాలు అయ్యాక తీరిగ్గా మాట్లాడుకుంటున్న సమయంలో భారతి తండ్రి వారి అత్తమామలతో మీరు మా అమ్మాయిని సరిగ్గా చూసుకోవడం లేదా? అని అడిగాడు.


 అది విని భారతి అత్తమామలు అలాగని భారతి మీతో చెప్పిందా? అని అడిగారు వారు. లేదు, లేదు నేనే అలా అనుకుంటున్నాను. ఎవరూ చెప్పకుండా మీకు మీరే ఎలా అనుకుంటారు అన్నారు వారు.


 దాంతో భారతి తండ్రి మాట్లాడుతూ అమ్మాయి పెళ్లయి అయిదు సంవత్సరాలు అయినా ఇంకా మమ్మల్నే తలుచుకుంటూ, మమ్మల్ని చూడాలని కలలు కంటుంది అంటే మీ కుటుంబంలో మా అమ్మాయి ఇంకా కలవలేదని అనిపిస్తుంది. 


మీరు ప్రేమగా చూసుకోకపోవడం వల్లే నిత్యం మమ్మల్ని కలవరిస్తుంది అని అనిపిస్తుంది అన్నాడు. అసలు నిజాన్ని సూక్ష్మంగా గ్రహించినందుకు భారతి అత్తమామలు ఆశ్చర్యపోయారు. 


భారతి తండ్రి మాట్లాడుతూ చూడండి! కోడలు అద్దం లాంటిది. అద్దం మనం నవ్వితే నవ్ఞ్వతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. అందుకే నేడు కోడలిని కూతురులాగే భావించి ప్రేమగా చూస్తుకుంటే రేపు మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రెండింతలు ప్రేమగా చూస్తుంది. లేకుంటే నేను చెప్పనవసరం లేదు అన్నాడు కోదండరామయ్య. వియ్యంకుని 


,అంతరార్ధానికి భారతి అత్తమామలు ఎంతో మెచ్చుకున్నారు. అప్పటి నుండి భారతి తల్లిదండ్రులను కలవరించలేదు.


*సేకరణ


ధర్మో రక్షతి రక్షితః 🙏🏻🙏🏻🙏🏻

సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: