10, నవంబర్ 2020, మంగళవారం

దివ్య ఔషధం శొంఠి గృతం.

దివ్య ఔషధం శొంఠి గృతం. 

నాకు కడుపులో మంట, తిన్నది అరగటంలేదు, నాకు గ్యాసు, నాకు కడుపులో నొప్పి, నాకు మోషన్ సరిగా అవటం లేదు. నాకు కడుపు ఉబ్బరం. నీరసంగా వుంటున్నది కానీ ఆకలి కావటంలేదు. అన్నం చూస్తే వెగటుగా వుంటున్నది, అన్నం తినాలని అనిపించటం లేదు. ఈ రకమైన బాధలు అన్ని కానీ కొన్ని కానీ లేక ఏదో వక్కటి కానీ లేనివాళ్లు నూటికి 50 మంది కన్నా ఎక్కువగా ఉంటారంటే ఆశ్చర్య పడవలసిన పనిలేదు.  మీకు జీర్ణాశయానికి సంబందించిన ఏ సమస్య ఐనా సులువుగా ఇంట్లోనే తయారుచేసుకునే మందుతో పరిష్కరించుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా. కానీ ఇది నిజం నూటికి నూరు పాళ్ళు మీకు ఉపయోగ పడుతుంది. మీరు చేసుకొని వాడి మీ తోటివారికి కూడా వాడమని చెప్పండి. 

శొంఠి అంటే తెలియని వారు వుండరు. ఇది మామూలు అల్లంను ప్రాసెస్ చేసి తాయారు చేసిందని మనలో చాలామందికి తెలియక పోవచ్చు. కానీ ఇది కూడా అల్లం యొక్క ఔషధ రూపం అని చెప్పవచ్చు. అల్లం కూడా చాల విధాలుగా మనకు ఆరోగ్య కరం. కానీ శొంఠి ఇంకా చాల ఉపయోగకరం. 

ఇప్పుడు శొంఠి గృతానికి కావలసిన పదార్ధాలను చూద్దాం. 

శొంఠి పొడి. దీనిని మనం సూపర్ మార్కెట్లలో కొనుక్కోవచ్చు లేదా శొంఠిని తీసుకొని దానిని మెత్తని పొడిగా మిక్సీ పట్టి కూడా తయారు చేసుకోవచ్చు. 

ఇక గోగృతం అంటే ఆవు నెయ్యి. మీకు నమ్మకంగా మార్కెటులో దొరికితే కొనండి. లేకపోతె రాందేవ్ బాబా స్టోరులో మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభిస్తుంది అక్కడ తీసుకోండి. . 

కొంత సింధవ లవణం లేక మాములు ఉప్పు. 

తయారు చేసే విధానం. 

మీరు శొంఠి గృతం యెంత చేయాలని  అనుకుంటున్నారో అంతకు సగం ఆవు నెయ్యి మిగిలిన సగభాగం శొంఠి పొడి తీసుకొని రెంటిని పూర్తిగా కొంచం సైన్ధవ లవణం కానీ మాములు ఉప్పుకాని కలిపి మొత్తం ఒక పేస్టులాగా చేయండి దానిని ఒక గాజు సీసాలో తీసుకోండి. ఈ మిశ్రమాన్నే శొంఠి గృతం అని అంటారు. 

ఉపయోగించే విధానం. 

మీరు రోజు భోంజనఁ చేసే ముందు ఒక చెంచా శొంఠిగృతం తీసుకొని దానిని కొంచం అన్నంలో కలిపి ఒక ముద్దగా చేసి దానిని మొదటి ముద్దగా తినండి తరువాత మీ పూర్తి భోంజనం చేయండి. 

మీరు ఈ విధంగా వాడిన తరువాత రెండు మూడు రోజులలో మీ అనారోగ్యం నయం అవుతుంది. శొంఠి జీర్ణ వ్యవస్థను బాగు పరుస్తుంది. ఆవు నెయ్యి చాలా మంచిది అది మీ ఆహరం పేగులలో సాఫీగా ప్రయాణించటానికి మరియు మీకు మంచి కోలాస్త్రలును అనిడిస్తుంది. ఈ రెంటి మిశ్రమము మీకు చాలా మంచిగా పనిచేస్తుంది. రోజు ఉదయం భోజనములో ఒక చెంచా రాత్రి భోజనములో ఒక చెంచా మాత్రమే వాడండి. పిల్లలకు వారి వయస్సును పట్టి అరచెంచా లేక అంతకన్నా తక్కువ వాడండి. 

గమనిక: ఇది చాలా సురక్షితమైన మందు ఐనా మీరు వాడటం వలన మీకు ఏమైనా సైడు ఎఫెక్ట్స్ వస్తే ఈ రచయిత భాద్యత లేదు గమనించండి. 

ఇది ఉపయోగించి లబ్ది పొందిన మిత్రులు మీ అనుభవాన్ని షేర్ చేస్తే సంతోషంగా ఉంటుంది, మరియు  నలుగురికి ఉపయోగ పడుతుంది. మరొక వైద్య విదితో ఇంకోసారి కలుదాం. 

మీ 

సి. భార్గవ శర్మ 

ఓం తత్సత్. 

సర్వ్యజన సుఖినో భవంతు. 

కామెంట్‌లు లేవు: