2, డిసెంబర్ 2020, బుధవారం

శ్రీరమణీయం - (726)*

 _*శ్రీరమణీయం - (726)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"భావం ఆత్మసాక్ష్యాత్కారానికి ఏవిధంగా అడ్డు అవుతుంది !?"*_


_*మనిషిలో ఏర్పడే తొలి భావమే నేను అనే తొలి తలపుగా ఉంది. ఆ భావమే ఆత్మసాక్షాత్కారానికి అడ్డుగా ఉంది. అయితే ప్రపంచంతోనూ, మన కష్టసుఖాలతోనూ మనను అనుసంధానం చేసేది భావమే. భావం అంటే మనో సంభాషణ. ఒక జంతువుకు దాహం వేస్తే వెళ్ళి నీరు త్రాగుతుంది. అదే మనిషి అయితే దాహం వేయగానే 'దాహంవేస్తోంది' అని అనుకుంటాడు. ఇలా అనుకునే మనో సంభాషణే భావం అంటే. అది బయటికి చెబితే భాష అవుతుంది. అంటే లోపల భావంగా ఉన్నదే బయటకు భాషగా వ్యక్తమౌతుంది. భాషకు ముందు మనసులో జరిగే సంభాషణే భావం. జంతువుకు దాహం తీర్చుకోవడానికి సహజ ప్రేరణ సరిపోతుంది. ఏ భావంతో అవసరంలేదు. దానికి ఏ భావం లేదు కనుకనే 'నేను' అనే భావం కూడా రాలేదు. ఇప్పుడు మనం భావాలతో ఉన్నాం కనుక నేను దేహాన్ని, నేను ఫలానా అని అనుకుంటూ ఉంటాం. ఆత్మసాక్షాత్కారం అంటే నేను ఆత్మను అని అనిపిస్తుందేమోనని అనుకుంటాం. కానీ అలాకాదు. ఆత్మసాక్షాత్కారం అంటే తాను దేహం అనిగాని, ఆత్మనని గానీ అనుకోని స్థితి. అది అసలు అనిపించడమే లేని స్థితి. నిద్రపోయేవాడు తాను నిద్రపోతున్నాను అనుకుంటున్నాడంటే తను నిజంగా నిద్ర పోవటం లేదని అర్థం. అలాగే ఆత్మానుభవం పొందినవాడు నేను దేహాన్ని అనుకోన్నట్లే నేను ఆత్మ స్వరూపుడిని అని కూడా అనుకోడు. ఏదీ అనుకోకుండా ప్రకృతి ప్రేరణతో కదులుతాడు !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం }"*_

_*"భగవదానుభవానికి భావ దూరంలోనే ఉన్నాము !''*- *(అధ్యాయం -89)*_


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: