1, డిసెంబర్ 2020, మంగళవారం

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1958 (౧౯౫౮)*


*10.1-962-*


*మ. అని చింతించి దయాళుఁడైన హరి మాయాదూరమై, జ్యోతియై,* 

*యనిరూప్యంబయి, సత్యమై, యెఱుకయై, యానందమై, బ్రహ్మమై,* 

*యనఘాత్ముల్ గుణనాశమందుఁ గను నిత్యాత్మీయ లోకంబు గ్ర*

*క్కునఁ జూపెం గరుణార్ద్రచిత్తుఁ డగుచున్ గోపాలకశ్రేణికిన్.* 🌺



*_భావము: దయాళువగు శ్రీకృష్ణుడు గోపాలురపై కరుణ వహించి వారికి ప్రకృతి మాయకు అతీతమైనది, జ్యోతిర్మయమైనది, ఇది అది అని నిరూపించబడలేనిది, నిత్యసత్యమైనది, జ్ఞానానందమయమైనది, పరిపూర్ణమైన బ్రహ్మమై, పాపరహితులైనవారు త్రిగుణాత్మకప్రకృతిని అధిగమించి కనుగొన్న శాశ్వతలోకమగు తనదైన వైకుంఠమును చటుక్కున చూపించాడు._* 🙏



*_Meaning: The merciful Sri Krishna was kind towards the Yadava folk and showed them His Supreme Abode, Vaikuntham, which is beyond the material world, radiating brilliance, that cannot be proved with any physical proofs, permanent, knowledgeable, complete in all respects, the eternal power, which conquered the primordial elements._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*


*వందేమాతరం*

                                                                                                                                                               *భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1960 (౧౯౬౦)*


*10.1-965-*


*ఆ. కామతంత్రటీక, కలువల జోక, కం*

*దర్పు డాక, విటులతాల్మి పోక,* 

*చకిత చక్రవాక, సంప్రీత జనలోక,* 

*రాక వచ్చె మేలురాక యగుచు.*🌺



*_భావము: కామసంబంధమైన విషయములకు వ్యాఖ్యానమువంటిది, కలువలను వికసింప చేసేది, మన్మథుడు విజృంభించటానికి అనువైనది, జారుల యొక్క ఓపికను నశింపజేసేది, చక్రవాక పక్షులకు భ్రమ, భ్రాంతి కలిగించేది, సకల జనులకు సంతోషము, శుభములు కలిగించేటటువంటి నిండుపున్నమి రానే వచ్చింది._* 🙏



*_Meaning: On the bright full moon day of Sharad Ruthu, the moonlight was felt like provocateur of carnal desires, black lilies were blooming, Manmatha, the God of love was out to strike at the hearts of the lovers, the patience of the paramours was tested to the ultimate, illusions were created in the minds of the poetical swans, great pleasure and happiness was experienced to one and all on this charming and delightful day._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

కామెంట్‌లు లేవు: