16, ఏప్రిల్ 2021, శుక్రవారం

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


అల్పమైన వాటి కోసం పరుగులు పెడుతుంటే ఉన్నతమైన దానిని కోల్పోవలసి వస్తుంది.


అల్ప దృష్టి కలిగినవాని వివేచన అసంబద్ధంగానే ఉంటుంది. సమదృష్టితో అంతా పరికించినప్పుడే హుందాతనంతో కూడిన తీర్పు వెలువడుతుంది. తనని తాను శరీరంగా భావించుకునే వ్యక్తిలో ఆధ్యాత్మికత నిలవదు.


మన ఆలోచనలు ఒక ఉదాత్తమైన ఆశయం కేంద్రంగా నిర్మితమై ఉండాలి. వాటిని మరింతగా విస్తరించే ప్రయత్నం చేస్తూ, వాటిని వదలక అంటిపెట్టుకుని ఉంటే, జీవితంలో నూతన అధ్యాయం ఆరంభం అవుతుంది.


పారే ఏటిలో నీరు ఎప్పుడూ తాజాగానే ఉంటుంది, పాకుడు ఏర్పడదు. అదే విధంగా మనలో ఉన్నతమైన ఆలోచనా స్రవంతిని సదా ప్రవహింప చేయ గలిగినప్పుడు, శాశ్వతమైన పునరుద్ధరణ జరుగుతుంది.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: