16, ఏప్రిల్ 2021, శుక్రవారం

కందుకూరి వీరేశలింగం పంతులు

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏* 

 *16-04-2021, శుక్రవారం* 

.*


*జాతి గర్వించదగ్గ నవయుగ వైతాళికుడి జన్మదినం..ఈరోజు* 


 *కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. వీరేశలింగానికి నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెద తండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. చిన్నప్పటి నుండి, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు.* 


 *స్త్రీ విద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించిన స్త్రీ పక్షపాతి. ఆడపిల్ల కన్నెత్తి మగవాడిని చూడటమే మాహాపాపంగా భావించే ఆ రోజుల్లో మగ పిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా ఆ మహానుభావుడే..అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టి, వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవారు.* 


 *తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి .తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.*


 *ఇంతటి మహనీయుల గురించి నేడు ఎంతమందికి తెలుసు..?? వారి పేరుని వారి సేవలని ప్రభుత్వం నాయకులు ప్రజలు గుర్తించి వారి ఆశయాలని నెరవేర్చనప్పుడే వారికి సరైన నివాళి.*

కామెంట్‌లు లేవు: