16, ఏప్రిల్ 2021, శుక్రవారం

యఙ్ఞసూత్రములు

 సృష్టి చేయుట యఙ్ఞమని బ్రహ్మ తెలిసికొని యఙ్ఞసూత్రములు బాహ్యంగా తెలియక పదార్ధ పృకృతి గాన రాక మానసిక యఙ్ఞం చేయుట వలననే సృష్టి చేయు విధానం తెలిసినది. భాగవతం లో బ్రహ్మ యే నారదు నికి విశధీకరించినట్టు నారదుని చే శుకుడు శుకునిచే పరీక్షిత్తు పరీక్షిత్తు వలన సకల ముని వరులకు తెలిసి తద్వారా మనకు పోతనామాత్యులద్వారా పరంపరగా తెలిసినది. మానసిక యఙ్ఞ విధానమును బ్రహ్మ సూత్రములనబడు వాజపేయి పౌండరీక, ఆపస్తంబ,మౌద్గల్య వాజసనేయ మెుదలగు సూత్రములద్వారా చేయవచ్చునని ఎందరో మహానుభావులు తెలిపితిరి. ఇప్పటికీ అఘోర

సాంప్రదాయం కూడా వున్నట్టు మనకు ప్రత్యక్షంగా తెలియుచున్నది. యిది కొన్ని చోట్ల అఘోర ఋషిః అని అంగన్యాస కరన్యాస

 పధ్దితిలో ఆచరణలో కలదు. మహన్యాసంలో కూడా కలదని తెలియుచున్నది. ఏమి లేనప్పుడు మానసికమే శరణ్యం. ఏ విధంగానైనా తెలిసికొనవలెనని జిజ్ఞాస కావాలి. అనగా జిఙ్ఞాస జీవ ఙ్ఞానం తెలియుట. అనగా ప్ర ఙ్ఞానమే జీవ ఙ్ఞానం. యిదే బ్రహ్మ సూత్రం. దానివలననే సమస్త సృష్టి. అదియే గాయత్రీ మంత్ర స్వరూపము సృష్టి. అణవు వ్యాప్తం గాయత్రీ సూక్మంగా నుండి అండ రూపం తరువాత జలం తో వ్యాప్తం జలం వలన రస, రూప, గంధాదులు సృష్టికి బీజాలు.మనం అంతా ఆ విరాట్ స్వరూపమైన పరమేశ్వరుల  ప్రకృతిలోని వారమే.90 సెకన్ల పాటు కనక ప్రాణాయామంలో స్థిరంగా యిష్ట దైవాన్ని మనసులో ముద్రించి ఆనందించుట యెూగం. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: