7, అక్టోబర్ 2021, గురువారం

ఉత్సాహం తో ఉంటే

 "అనిర్వేదః శ్రియోమూలం అనిర్వేదః పరం సుఖం,

అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః."

ఇది వాల్మీకి విరచిత రామాయణ లోని శ్లోకం. 

నిర్వేదం అంటే దిగులు, ఈనాటి భాషలో డిప్రెషన్. 

అనిర్వేదం అంటే ఉత్సాహం. 

అనిర్వేదమే శ్రేయస్సుకరం. అదే పరమసుఖం. అదే మానవుడిని ముందుకు నడిపిస్తుంది, అన్ని పనులను సఫలం చేస్తుంది. నేను మనసు నుంచి నిరుత్సాహన్ని పారద్రోలి ఉత్సాహం తో వెతుకుతాను, 

అని లంకలో హనుమ రావణ అంతఃపురము లో సీతాదేవి ని కానక దిగులు పడి ,అంతలోనే తేరుకుని అనుకున్న మాట. 

నిజానికి ఇది మనకు వర్తిస్తుంది. ప్రతి చిన్న విషయానికి దిగులు చెందుతూ జీవితం దుర్భరం చేసుకుంటాము. అలా కాకుండా ఉత్సాహం తో ఉంటే జీవితం లో అన్నీ సాధించించగలము.

చక్కని సందేశం.

కామెంట్‌లు లేవు: