16, జూన్ 2023, శుక్రవారం

యజ్ఞవల్క్యుడు

 🎻🌹🙏సూర్యభగవానుని శిష్యుడు.....!!

      

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿గొప్ప జ్ఞానిగా పేరుపొందిన సకలుని పుత్రుడు వైశంపాయనుడు. ఈయన వేదవ్యాసుని శిష్యుడు. సకల

వేదవేదాంగాలలో  నిష్ణాతుడు.


🌸ఒకనాడు వైశంపాయనుడు తన శిష్యులతో " ఈనాడు మనం అందరం భయం లేకుండా  యజ్ఞయాగాదులు ప్రశాంతంగా చేసుకోగలగడానికి కారణం  మిధిలా నగరాన్ని  పాలిస్తున్న జనక మహారాజు కనుక మీరు  రోజుకు ఒకరు చొప్పున  ఆ మహారాజు భవనానికి వెళ్ళి మంత్రాక్షింతలతో మహారాజును వారిని ఆశీర్వదించి రావాలి"  అని ఆదేశించాడు.


🌿గురువుగారి ఆనతి ప్రకారం  శిష్యులు అందరూ ఒక్కొక్క రోజు  మహారాజుని ఆశీర్వదించి రాసాగారు.


🌸వైశంపాయనుని శిష్యులలో ఒక శిష్యుడు మహాజ్ఞాని. అతను

మహావిష్ణువు ఆనుగ్రహంతో జన్మించినవాడని పురాణ గ్రంధాలు కీర్తిస్తున్నాయి.  


🌿ఈయన జనకుని ఆశీర్వదించే రోజు వచ్చినది. అతను జనక మహర్షి భవనానికి వెళ్ళాడు.

కాని  ఆ సమయాన మహారాజు  అక్కడ  లేకపోవడంతో

మంత్రాక్షింతలను అక్కడి  మండపంలో  వేసి వెళ్ళిపోయాడు.


🌸 జనకమహారాజు తిరిగి వచ్చి చూసేసరికి  ఆశ్చర్యకరంగా ఆ మండపమంతా విరిసిన పరిమళ పుష్పాలతో కళకళలాడుతూ కనిపించింది. ఆ శిష్యుని అక్షితల ప్రభావం వలన పుష్పవనంగా మారిన ఆ ప్రాంతం మహారాజు మనసుని ఉత్సాహభరితం చేసింది. 


🌿అక్షంతలు జల్లి  వెళ్ళిపోయిన ఆ జ్ఞానిపై జనకమహారాజు కి ప్రత్యేకమైన అభిమానం కలిగింది. ఇంక మీదట  "నిత్యము జ్ఞానసిధ్ధి పొందిన ఆ శిష్యుడే వచ్చి మంత్రాక్షింతలతో  ఆశీర్వదించేలా ఏర్పాట్లు చేయమని

జనకమహారాజు వైశంపాయనుని కోరాడు.


🌸కాని  జ్ఞానియైన ఆ శిష్యుడు  గురువుగారు మొదట ఏర్పాటు చేసిన 

పధ్ధతి ప్రకారం నిత్యం ఒక్కొక్క శిష్యుడుగా వెళ్ళి

ఆశీర్వదించడమే సముచితమని

చెప్పాడు. 


🌿ఈ విధంగా నడచుకోవడం  మహారాజు మాటను అతిక్రమించి నట్లు కాదని వినయంగా తెలిపి  తోటి శిష్యులకు సమంగా అవకాశాలు కలిగించాడు.


🌸తర్వాతి కాలంలో  ఈ శిష్యుడే జనక మహారాజుకు బ్రహ్మవిద్యను ఉపదేశించినట్లు  పురాణ గ్రంధాలు తెలుపుతున్నవి. ఆవిధంగా ఆయన బోధించిన కాలంలో జనకపురి ఆశ్రమాన్ని  కణ్వమహర్షి.

ఈయన ఆ  జ్ఞాన శిష్యుని ప్రధమ శిష్యుడు. 


🌿ఆయనే శ్రీ మన్నారాయణుని అంశయైన యజ్ఞవల్కుడు.

భూలోకంలో  ఈయన అవతరించడమే

ఒక అద్భుతం. 


🌸భరతఖండంలో ఉత్తర భాగాన

వర్ధమానపురం వున్నది. ఇక్కడే సకలుడు అనే ఋషి నివసించేవాడు. ఆయనకి సునంద అనే పుత్రిక, వైశంపాయనుడనే పుత్రుడు 

వున్నారు. 


🌿సరస్వతీ దేవి అంశ  అయిన సునందని బ్రహ్మరధుడు వివాహం చేసుకున్నాడు.

చాలాకాలం దాకా వీరికి సంతానం కలుగలేదు. ఆయన 

శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ

తపస్సు చేశాడు. 


🌸బ్రహ్మరధుని తపస్సు కి మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు. బ్రహ్మరధుడు 'సద్గుణవంతుడు ,  సకలశాస్త్రపారంగతుడైన,  ఒక పుత్రుని ప్రసాదించమని నారాయణుని

వరం కోరాడు. 


🌿నారాయణుడు అనుగ్రహించాడు.

కాలక్రమంలో సునందా దేవి గర్భవతి అయినది.కాని ప్రసవం కాలేదు. 

నెలలు నిండాయి. సంవత్సరాలు గడిచాయి.  అయినా ప్రసవం

మాత్రం జరుగలేదు. గర్భంలోని శిశువుని కారణమడుగగా, 

శ్రీ మన్నారాయణుని అనుగ్రహం నాకు లభిస్తేనే జన్మిస్తాను"

అనే మాటలు వినపడ్డాయి.


🌸బ్రహ్మరధుడు తిరిగి తపస్సు చేశాడు. ఐదు సంవత్సరాల గర్భవాసానికి తరువాత మహావిష్ణువు అనుగ్రహంతో బిడ్డ క్షేమంగా జన్మించాడు. శతభిషా నక్షత్రం, ధనుర్లగ్నం  కూడిన శుభదినమున శ్రీ మన్నారయణుడే అవతరించాడు. ఇదే యజ్ఞవల్క్యుని అవతార దినం.


🌿పెద్దలు ఆ పిల్లవానికి పెట్టిన పేరు "సానందరుడు'' మహర్షులు పరమానందంతో

యజ్ఞవల్క్యుడని పిలుస్తారు.

దేవగురువైన బృహస్పతి   నాలుగు వేదాలు, సకల విద్యలు , సకల కళలు యీయనకు నేర్పి ఉపనయనం చేశాడు.


🌸పిదప వేద వ్యాసుని వద్ద వేదాధ్యయనం చేశాడు యజ్ఞవల్క్యుడు. ఋగ్వేదమును యజుర్వేదమును,  59 భాగాలు అభ్యసించాడు. తన తల్లి సోదరుడైన వైశంపాయన మహర్షి వద్ద

జ్ఞానయోగమును అభ్యసించాడు. 


🌿వైశంపాయనుని వద్ద శిష్యునిగా వున్న సమయంలో  జనకుని అనుగ్రహించిన సంఘటనలు జరిగాయి.


🌸వేదాలలో ప్రధాన భాగాలు అభ్యసించిన పిదప 15 భాగాలు మిగిలి వున్నవి ఆ భాగాలు

సూర్యభగవానునికి మాత్రమే తెలుసు . 

యజ్ఞ వల్క్యుడు  గాయత్రీ దేవిని

ఉపాసించి తపస్సు చేశాడు.


🌿 గాయత్రీ దేవి సూర్యభగవానుని ద్వారా మిగిలిన భాగాలు నేర్చుకునేటేందుకు సహాయం చేసినది.

అనేక కఠోర పరీక్షల  తరువాత సూర్యదేవుడు యజ్ఞవల్క్యుని తన శిష్యునిగా చేసుకొన్నాడు. తనకి తప్ప మరి ఎవరికి తెలియని యజుర్వేద రహస్యాలను నేర్పేడు.


🌸యజ్ఞవల్క్యుడు  గృహంలో నివసిస్తూనే తన శిష్యులకు శుక్ల యజుర్వదమును, వేదాలను నేర్పేరు.


🌿" యజ్ఞ వల్క్య స్మృతి'  అనే గ్రంధాన్ని వ్రాశారు. ఈనాటి చట్ట ప్రమాణాలు, మొదలైన విజ్ఞానమును తెలిపే ఆది గ్రంధంగా వున్నది...స్వస్తీ...🚩🌞🙏🌹🎻

కామెంట్‌లు లేవు: