16, జూన్ 2023, శుక్రవారం

వారాహీనవరాత్రులు

 *వచ్చే సోమవారము నుండి వారాహీనవరాత్రులు*


వారాహీ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు. ఆషాడ మాసంలో అమ్మవారిని వారాహీ మాతగా ఆరాధిస్తుంటారు. వారాహి మాత అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి అనుకూలమైన రోజులు. 2023లో జూన్ 19వ తేదీ నుండీ 27 వతేదీ వరకూ వారాహీ నవరాత్రులు వచ్చాయి. ఈ నవరాత్రుల ప్రత్యేకతలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. గుప్త నవ పర్వదినాలలో అమ్మవారి ఆరాధనతో సంపద, ధైర్యం ఆ తల్లి ప్రసాదిస్తుందని నమ్మకం.


భూ దేవి స్వరూపిణి, లక్ష్మీ స్వరూపిణి, వరాహ స్వామి స్త్రీ రూపం వారాహి మాత. అమ్మవారు నాగలిని ధరించి కనిపిస్తుంది. భూమిని చదును చేసుకొని విత్తులు నాటే ఈ సమయంలో వారాహీ రూపంలో అమ్మవారిని పూజిస్తే పంటలు బాగా పండుతాయని విశ్వాసం. భూమాత దయ ఉంటే పంటలు బాగా పండుతాయి. రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది. వారాహి మాతను పూజిస్తే మనకు రక్షణ కలిగించే దేవతగా మారుతుంది. శత్రు సంహారం జరుగుతుంది. వారాహి మాత మంత్రం సిద్దిస్తే జరగబోయేది ఏంటో కల రూపంలో మనకు ముందుగానే తెలుస్తుందని పెద్దలు చెబుతుంటారు. వారాహీ దేవి ఆయుర్వేద వైద్య దేవిగా కూడా కొలుస్తారు.


వారాహీ పూజనూ సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత చేయాలని శాస్త్రం చెబుతోంది. లడ్డూలను లాంటి పదార్దాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజించాలి. భూమిలో దొరికే గడ్డలు, చిలకడదుంపలు , దానిమ్మలూ నైవేద్యంగా పెడితే మరీ మంచిది. నీలిరంగు పువ్వులతో పూజ విశేష ఫలితాలను కలిగిస్తుంది. ముఖ్యంగా రేవతి నక్షత్రం రోజు విశేష పూజను ఆచరిస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది..వారాహి దేవిని శ్రీ విద్యా సంప్రదాయంలో పూజించే విధానం కూడా ఉంది కానీ అది శ్రీవిద్యా ఉపాసకులు మాత్రమే చేయగలడం సాధ్యం. సాధారణ పద్దతిలో ప్రతి ఒక్కరు ఈ తల్లిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు.

మీ 

శ్రీశర్మద 

8333844664

కామెంట్‌లు లేవు: