18, జులై 2023, మంగళవారం

ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి.

 వివాహ బంధం విశిష్టతను వివరించే ఒక శ్లోకం మహాభారతంలోని అష్టక-యయాతి సంవాదంలో ఉంది. దీన్ని 'గృహోపనిషత్' అంటారు. ఆ శ్లోకం ఇది:


'ధర్మాగతం ప్రాప్యధనం యజేత దద్యాత్సదైవాతిధీన్ భోజయేచ్ఛ అనాధదానశ్చ పరైరదత్తం సైషాగృహస్థోపనిషత్ పురాణీ!!'


అంటే, 'ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి. సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దైవకార్యాలకు, దానానికి వెచ్చించాలి. ఇతరుల ధనాన్ని ఎన్నడూ అపహరించరాదు. ఇతరులు దానం చేసిన దాన్ని తీసుకోవచ్చు. ఇంటికి విచ్చేసిన అతిథులను సాదరంగా సత్కరించి, భోజన సమయమైతే తప్పక వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి.' అతి ప్రాచీనమైన గృహస్థోపనిషత్ ఇదే!


ఒక మనిషి జీవితంలో వివాహ సంస్కారానికి గల ప్రాముఖ్యం అంత గొప్పది! ఈ గొప్పదనమే ఈ వివాహ వ్యవస్థను హైందవ జీవనంలో సుస్థిరం చేసింది, తరతరాలకు మార్గదర్శనం చేస్తోంది.

కామెంట్‌లు లేవు: