13, జులై 2023, గురువారం

మహాభారత యుద్ధ నియమాలు :

 మహాభారత యుద్ధ నియమాలు :-


యుద్ధానికి ముందు భీష్ముని మార్గదర్శకత్వంలో ఇరు సైన్యాద్యక్షులు ధర్మయుద్ధ నియమాలను విధించారు. ఈనియమాలు

సూర్యోదయం తోనే యుద్ధం మొదలుపెట్టి, సూర్యాస్తమయంతో విరమించాలి.


ఒకవీరునితో ఒకేవీరుడు తలపడాలి, అనేకమంది కలసి ఒకేవీరునితో పోరాడరాదు.


రథికులు రథికులతో, ఆశ్వికులు ఆశ్వికులతో, గజబలం గజబలంతో, పదాతులు పదాతులతో మాత్రమే యుద్ధం సాగించాలి.


యుద్ధవాయిద్యాలు మ్రోగించే వారిని చంపరాదు

వాగ్యుద్ధం కోరేవారిపై శస్త్రాలను సంధించరాదు

అలసినవారిని, గాయపడినవారిని, పారిపోతున్నవారిని, యుధ్ధంలో పాల్గొనని మనుషి లేదా జంతువును చంపరాదు.


శరణువేడినవారిని వధింపరాదు, అయితే శరణార్ధి యుద్ధ ఖైదీగా బానిసగా వుంటాడు.


యుద్ధనియమాలని తు.చ తప్పక పాటించాలి.

అయితే ఇంచుమించు ఈ యుద్ధనియమాలన్నిటినీ ఇరుపక్షాలు ఒక్కసారైనా ఉల్లంఘించాయి.


#కురుక్షేత్రం లో #మహారథి లు కొందరు వీరులు పాల్గొన్నారు

మహారథి లు అతిరది కి 12 రేట్లు ఎక్కువ వీరు ఏక కాలంలో

7, 20000 సైన్యం తో యుద్ధం చేయగలరు

వాళ్ళు #భీష్ముడు నిజానికి ఇతనితో పోరాడే వీరుడు లేడు ఆ యుద్ధంలో స్వయంగా శ్రీకృష్ణుడే ఒప్పుకుంటాడు తన గురువు పరుశరాముడిని ఓడించాడు (ఇతడు #అతిమహారథి కి సమానంగా యుద్ధం చేయగలుగుతాడు )మిగిలినవారు అంత మహారథి లు వారే

అర్జునుడు ద్రోణుడు కర్ణుడు కృష్ణుడు భీముడు అశ్వద్ధామ భగదత్తుడు శల్యుడు కృపాచార్యుడు సాత్యకి బలరాముడు విదురుడు జరాసంధుడు కంసుడు వీరంత మహా భారతంలో #మహారథి లు

#అతిమహారథి మహా భరత సమయానికి ఒకడే వున్నాడు

అతడే పరుశరాముడు ఇతను మహారథి కి 12 రేట్లు ఎక్కువ

ఏకకాలంలో 86,40000 వీరులతో యుద్ధం చేయగలడు ఇతడు కురుక్షేత్రం లో యుద్ధం చేయలేడు ఆ సమయానికి ఇతను జీవన్ బ్రహ్మఐక్య స్థితిలో వున్నాడు ఇతడు చాలా వీరులకు గురువు మాత్రమే

#వ్యూహాలు:-


యుద్ధ సమయంలో ఇరు పక్షాలూ తమ తమ సేనలను వివిధ వ్యూహాలలో సమాయత్తం చేసుకొన్నాయి. ఆ రోజు యుద్ధంలో సాధించ దలచిన లక్ష్యానికి అనుగుణంగాను, ఎదుటి పక్షం బలాబలాలను ఎదుర్కోవడానికి వీలుగాను ఈ వ్యూహాలు పన్నినట్లు అనిపిస్తుంది. ఈ వ్యూహాల పేర్లు ఆ వ్యూహాల స్వరూపానికి అనుగుణంగా జంతువులు లేదా వస్తువుల పేర్లతో ఉన్నట్లున్నాయి.


వ్యూహ రచన గురించి "డాక్టర్‌ #యల్లాప్రగడ_మల్లికార్జునరావు" ఇలా రాశాడు.


విశిష్టమైన సైన్య రచనా పద్ధతిని వ్యూహం అని వ్యూహ శాస్త్రనిపుణులు వివరిస్తారు. తమ సైన్యం తక్కువగాను, ఎదటి సైన్యం ఎక్కువగాను ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయుక్తమవుతుంది. ఒకవేళ అధికంగా సైన్యం ఉన్నా ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపచేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా, విజయం తమకు దక్కేలా తగినట్లుగా వ్యూహాన్ని నిర్మించుకోవాలి.


మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మవ్యూహం, శకట వ్యూహం, సూచి, శ్యేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్థ, శృంగాటక ఇలా అనేకానేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. పశువులు, పక్షుల పేర్లతో రూపొందించే వ్యూహాలు నిజానికి ఆయా పశువులు, పక్షులు తమ శత్రువులతో ఎలా పోరాడితే గెలుస్తున్నాయో అటువంటి స్వభావాన్ని అంతటినీ వ్యూహ రచయిత సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు.


అచలం అంటే పర్వతం, అచల వ్యూహమన్నప్పుడు ఒకచోట ఒక క్రమపద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువును ఎదుర్కొంటుంది,


మకర వ్యూహంలో మకరం అంటే మొసలి, మొసలి నోరుభాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహన్ని రూపుదిద్దుతారు.


కూర్మం వీపు భాగం ఎంతో గట్టి కవచంలాగా ఉంటుంది. కూర్మవ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికీ దెబ్బతగలకుండా మిగిలిన సైనిక భాగాలన్ని రక్షక కవచంలాగా ఉంటాయి.


శ్యేనం అంటే డేగ, డేగ కళ్ళు ఎంతో చురుకుగా ఉంటాయి. ఆ కళ్ళతోటే తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుండి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతుంది. అలాగే శత్రుసైన్యాన్ని చిత్తు చేయటానికి ఈ వ్యూహాన్ని వాడతారు.


క్రౌంచ పక్షి ముక్కు చాలా ధృడంగా ఉంటుంది. ఈ వ్యూహంలో ముక్కు భాగంలో ఉండే వారిని జయించటమంటే శత్రువు ఎంతో కష్టానికి గురికావలసి వస్తుంది.


పద్మవ్యూహం ఇందులో సైన్యాన్ని 7 వలయాలుగా ఒక క్రమ పధ్ధతి లో అమరుస్తారు. లోపలికి ప్రవేశించడానికి వీలుగా ఒకేఒక మార్గం ఉంటుంది అని ఒక అంచనా. ఈ మార్గం గుండా ప్రవేశించి లోపలికి వెళుతూ శత్రు సంహారం చేస్తూ గమ్యాన్ని చేరుకుంటారు.


వ్యూహాలు పన్నటానికి తగిన సమయం, వాటికి సంబంధించిన విషయాలను #శుక్రనీతిలో గమనించవచ్చు. నదులు, అడవులు, దుర్గాలు, తదితర ప్రాంతాలలో తమ సేనకు ఏదైనా ముప్పు వాటిల్లబోతుంది అని సేనాపతి భావించినప్పుడు సందర్భానికి తగిన వ్యూహరచన చెయ్యడం జరుగుతుండేది. సైన్యం ప్రయాణిస్తున్నపుడు అగ్రభాగంలో ఉన్న సైనిక బలానికి ప్రమాదం ఎదురవుతుందన్నప్పుడు మొసలినోరు భాగాన్ని పోలినట్లుగా మకర వ్యూహాన్ని పన్ని శత్రువును చిత్తు చేసేవారు. అవతల శత్రువు కూడా బలంగానే ఉంటే డేగను పోలిన శ్యేన వ్యూహాన్ని పన్నేవారు. శ్యేన వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చెయ్యటానికి #సూచీ వ్యూహాన్ని పన్నేవారు.


అగ్రభాగాన కాక, వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుందనుకుంటే #శకటం (బండి) లాగా వ్యూహారచన చేసేవారు. ముందూ వెనుకా కాక పక్క భాగాల నుండి ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే ♦వజ్ర వ్యూహాన్ని అలా కూడా కాక నాలుగువైపుల నుండి శత్రువులు దాడి చేయబోతున్నారనుకున్నప్పుడు 🎆చక్రవ్యూహమూ భద్రం, వ్యాళం అనే పేర్లున్న వ్యూహాలను కానీ పన్నేవారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయుక్తమయ్యేవిగా ఉండగా, మరికొన్ని తమను తాము కాపాడుకోవటానికి పనికొచ్చేవిగా ఉంటాయి. వ్యూహాలకు అందులో వుండే సైనికులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ ముందుకు నడవటానికికానీ శత్రువును నిర్భయంగా ఎదుర్కోమని చెప్పటానికి కానీ, వెనక్కి తిరిగి రమ్మనమని చెప్పటానికి కానీ సంబంధిత నాయకులు యుద్ధ సమయంలో ఉపయోగంచే 🎺వాద్య పరికరాలను ఉపయోగించటం, రథానికున్న 🚩ధ్వజాలు, 🏳జెండాలతో సూచనలు చేయడం లాంటివి చేస్తుండేవారు. ఇలా వ్యూహారచనా విన్యాసాలు సమరకళలో ఆనాడు ఎంతో ప్రాధాన్యం వహిస్తుండేవి.


1వ రోజు


పాండవ వ్యూహం - వజ్ర వ్యూహం

కౌరవ వ్యూహం - సర్వతోముఖ వ్యూహం


#విశేషాలు:- కృష్ణుడు అర్జునునకు గీతోపదేశం చేశాడు. భీష్ముడు దావానలంలా విజృంభించాడు. అభిమన్యుడు, అర్జునుడు మాత్రమే అతనిని కాస్త నిలునరించ గలిగారు. ఆరోజు పాండవులు చింతా క్రాంతులయ్యారు.


2వ రోజు:-


పాండవుల వ్యూహం - క్రౌంచ వ్యూహం

కౌరవుల వ్యూహం - త్రికూట వ్యూహం


#విశేషాలు :-అర్జునుడు భీష్ముని తీవ్రంగా బాధించాడు. భీముడు విజృంభించి కళింగ సేనను కల్లోల పరచాడు. అభిమన్యుని ధాటికి తట్టుకోవడం భీష్మ ద్రోణులకు కూడా సాధ్యం కాలేదు.


3వరోజు:-


పాండవ వ్యూహం - అర్ధచంద్ర వ్యూహం

కౌరవుల వ్యూహం - గరుడ వ్యూహం


#విశేషాలు :- భీష్ముని దాడితో క్రోధుడైన అర్జునుడు చెలరేగి కౌరవ సేనను దావానలంలా దహించాడు.


4వ రోజు :-


పాండవ వ్యూహం - ?

కౌరవుల వ్యూహం - ?


#విశేషాలు :- అభిమన్యుడు, భీముడు విజృంభించారు. తొమ్మండుగురు కౌరవ సోదరులు భీముని చేత హతులయ్యారు. ఘటోత్కచుని మాయాయుద్ధంతో కౌరవసేన కకావికలయ్యింది.


5వ రోజు :-


పాండవ వ్యూహం - శ్యేన వ్యూహం

కౌరవుల వ్యూహం - మకర వ్యూహం


#విశేషాలు :- పాండవుల పక్షంలో భీముడు, అభిమన్యుడు, అర్జునుడు చెలరేగిపోయారు. కౌరవుల పక్షంలో భీష్ముడు, భూరిశ్రవుడు విజృంభించారు. విజయం ఎటూ కాకుండా పోయింది. భూరిశ్రవుని చేత సాత్యకి కొడుకులు పదిమంది మరణించారు. అర్జునుడు పాతికవేల రథికులను నిర్జించాడు.


6వ రోజు :-


పాండవ వ్యూహం - మకర వ్యూహం

కౌరవుల వ్యూహం - క్రౌంచ వ్యూహం


#విశేషాలు :- భీముడు, పాండవుల కొడుకులు ఐదుగురూ కౌరవులను ముప్పుతిప్పలు పెట్టించారు. ద్రుపదుడు, ద్రోణుడు తలపడ్డారు. నకులుడి కొడుకు శతానీకుడు అద్భుతంగా యుద్ధం చేశాడు.


7వ రోజు :-


పాండవ వ్యూహం - క్రౌంచ వ్యూహం

కౌరవుల వ్యూహం - మండల వ్యూహం


#విశేషాలు :- కౌరవులలో భీష్ముడు, పాండవులలో భీమార్జునులు అద్భుతంగా యుద్ధం చేశారు. భగదత్తుడు ఘటోత్కచుని తరిమేశాడు. సాత్యకి అలంబసుడిని తరిమేశాడు. ధర్మరాజు ధాటికి శ్రుతాయువు పారిపోయాడు. సుశర్మ అర్జునుడిని ఢీకొన్నాడు.


8వ రోజు :-


పాండవ వ్యూహం - శృంగాటక వ్యూహం

కౌరవుల వ్యూహం - కూర్మ వ్యూహం


#విశేషాలు :- భీముడి చేత 12 మంది కౌరవ సోదరులు మరణించారు. ఘటోత్కచుని తమ్ముడు ఇరావంతుడు అలంబసునిచేత మరణించాడు. అర్జునుని తీవ్రత కొనసాగింది.


వ రోజు :-


పాండవ వ్యూహం - ?

కౌరవుల వ్యూహం - సర్వతోభద్ర వ్యూహం


#విశేషాలు :- భీష్ముని ప్రతాపాన్ని తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. అర్జునుడు తేజోహీనుడయ్యాడు. ఇక లాభం లేదని కృష్ణుడే స్వయంగా చక్రధారియై భీష్మునిపైకి లంఘించాడు. అర్జునుడు బ్రతిమాలగా కృష్ణుడు వెనక్కి తగ్గాడు. భీష్ముని చంపడం సాధ్యం కాదనుకొన్న పాండవులు ఆ రాత్రి భీష్ముని ప్రార్థించారు. పాండవులు శిఖండిని అడ్డుపెట్టుకొని యుద్ధం చేస్తే తనకు యుద్ధోత్సాహం నశిస్తుందని భీష్ముడు సలహా ఇచ్చాడు.


10వ రోజు :-


పాండవ వ్యూహం - ?

కౌరవుల వ్యూహం - ?


#విశేషాలు:- భీష్ముడు, అర్జునుడు, శిఖండి, ధర్మరాజు విజృంభించారు. శిఖండి ఎదురుపడినప్పుడల్లా భీష్ముడు వేరేవైపు వెళ్ళసాగాడు. ధర్మరాజు పరాక్రమానికి ద్రోణుడు నిలువలేకపోయాడు. అర్జునుడి శరపరంపరకు భీష్ముడు కూలిపోయాడు. అంపశయ్యపై విశ్రమించాడు.


11వ రోజు :-


పాండవ వ్యూహం - క్రౌంచ వ్యూహం

కౌరవుల వ్యూహం - శకట వ్యూహం


#విశేషాలు:- కౌరవ సేనాపతిగా ద్రోణుడున్నాడు. కర్ణుడు #మొదటిసారి యుద్ధరంగంలో ప్రవేశించాడు. ద్రోణుడు ధర్మరాజును పట్టుకోబోయే సమయంలో అర్జునుడు అడ్డం పడ్డాడు. మరుసటిరోజు అర్జునుని రణరంగంనుండి దూరంగా తీసుకెళ్ళాలని త్రిగర్త దేశాధీశుడు సుశర్మతో కలిసి పన్నాగం పన్నారు.


12వ రోజు :-


పాండవ వ్యూహం - మండలార్ధ వ్యూహం

కౌరవుల వ్యూహం - గరుడ వ్యూహం


#విశేషాలు:- సంశప్తకులను ఓడించి కృష్ణార్జునులు యుద్ధంలోకి తిరిగి వచ్చారు. భగదత్తుని వైష్ణవాస్త్రం కృష్ణునివల్ల వ్యర్ధమయింది. అర్జునుడు భగదత్తుని వధించాడు. కర్ణార్జునులు తొలి ద్వంద్వయుద్ధం చేశారు. మరునాడు అర్జునుని ఇంకా దూరంగా తీసుకెళ్ళాలని, తిరిగి రానీయమని సంశప్తకులు మాట యిచ్చారు.


13వ రోజు :-


పాండవ వ్యూహం - సాధారణ వ్యూహం

కౌరవుల వ్యూహం - పద్మ (చక్ర) వ్యూహం (తమ్మి మొగ్గరము)


#విశేషాలు:- ద్రోణాచార్యుడు 🍥పద్మవ్యూహం పన్నాడు. పద్మ వ్యూహాన్ని ఛేదించి అభిమన్యుడు కాలాగ్నిలా చెలరేగిపోయాడు. కర్ణుడు పారిపోయాడు. తక్కిన పాండవులను జయద్రధుడు వ్యూహ ద్వారంలో ఆపేశాడు. ఒంటరియైన అభిమన్యుడు ఏడుమార్లు తనను చుట్టుముట్టినవారిని మట్టి కరిపించారు. ఎనిమిదవ సారి అభిమన్యుని అన్నివైపులనుండి చుట్టుముట్టి వెనుకనుండి నిల్లు విరిచి అతనిని చంపేశారు. మరునాడు సూర్యాస్తమయంలోపు సైంధవుని చంపుతానని అర్జునుడు ప్రతిన పూనాడు.


14వ రోజు :-


పాండవ వ్యూహం - ?

కౌరవుల వ్యూహం - శకటవ్యూహం + పద్మవ్యూహం + సూచీవ్యూహం


#విశేషాలు:- ద్రోణుని వ్యూహ రచన సైంధవుని రక్షించడం కోసం చేయబడింది. అయినా అర్జునుడు అందరినీ జయించి తృటిలో వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడు. శ్రుతాయుధుడు, కృతవర్మాదులు, విందానువిందులు అర్జునునిచేత మరణించారు. ఘటోత్కచుడు అలంబసుడిని, హలాయుధుడిని వధించాడు. దుర్మర్షణుడు, దుర్మధుడు, శత్రుంజయుడు వంటివారు భీమునిచేత చచ్చారు. సాత్యకి భూరిశ్రవుని చంపాడు. చివరకు అర్జునుడు సైంధవుని చంపి తన ప్రతిన నెరవేర్చుకొన్నాడు. రాత్రి పూట జరిగిన యుద్ధంలో ఘటోత్కచుడు పెట్రేగిపోయాడు. అర్జునుని చంపడానికి దాచుకొన్న #శక్తి ని ప్రయోగించి కర్ణుడు ఘటోత్కచుని కడతేర్చాడు.


15వ రోజు :-


పాండవ వ్యూహం -

కౌరవుల వ్యూహం -


#విశేషాలు :- ద్రోణార్జునుల ద్వంద్వ యుద్ధంలో ఎవరూ ఓడలేదు. చివరకు "అశ్వత్థామ" (అనే ఏనుగు) మరణించినట్లు ప్రకటించగా ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. ధృష్ష్టద్యుమ్నుడు ద్రోణుని శిరసు తెగనరికాడు. దుఃఖ క్రోధాలతో రెచ్చిపోయిన అశ్వత్థామ పాండవులపై విరుచుకుపడ్డాడు. అశ్వత్థామ దివ్యాస్త్రాలు కృష్ణార్జునుల శక్తియుక్తులవలన వృధా అయ్యాయి. వేదవ్యాసుడు అర్జునునికి పరమేశ్వర మహిమను విశదీకరించాడు.


16వ రోజు :-


పాండవ వ్యూహం - అర్ధచంద్ర వ్యూహం

కౌరవుల వ్యూహం - మకర వ్యూహం


#విశేషాలు :- అశ్వత్థామ సూచనపై దుర్యోధనుడు కౌరవ సైన్యాధిపతిగా కర్ణుని నియమించాడు. భీముడు క్షేమధూర్తిని వధించాడు. ప్రతివింధ్యుడు చిత్రసేనుని చంపేశాడు. భీముడు అశ్వత్థామతోను, కర్ణుడు నకులునితోను, అర్జునుడు సుశర్మతోను ద్వంద్వ యుద్ధాలు చేశారు. ధర్మరాజు సుయోధనుని మూర్ఛిల్ల చేశాడు. అర్జునుడూ, కర్ణుడూ ఎదురి పక్షాలను గగ్గోలు పెట్టించారు. మరునాడు పాండవులను అంతం చేస్తానని కర్ణుడు దిగాలుగా ఉన్న దుర్యోధనునికి మాట యిచ్చాడు.


17వ రోజు :-


పాండవ వ్యూహం - దుర్జయ వ్యూహం

కౌరవుల వ్యూహం - ?


#విశేషాలు :- దుర్యోధనుని ప్రార్థననంగీకరించి కర్ణునికి సారథ్యం చేయడానికి శల్యుడు అంగీకరించాడు. శల్యుడి పరుష వ్యంగ్య వచనాలకు కర్ణుడు నొచ్చుకొన్నాడు. కర్ణుడూ, కర్ణుని కొడుకులూ చెలరేగి పాండవ సైన్యాన్ని కాలరాచేశారు. కర్ణుడు ధర్మరాజుని పట్టుకొని పరుషంగా అవమానించి వదిలేశాడు. భీముడు దుశ్శాసనుని వధించి దారుణంగా రొమ్ము చీల్చి రక్తం త్రాగాడు. కర్ణార్జునుల ద్వంద్వయుద్ధం ప్రళయ సమానంగా సాగింది. కర్ణుని సర్పముఖాస్త్రం విఫలమయ్యింది. కర్ణుని రథం భూమిలో దిగబడినపుడు అర్జునుడు #అంజలికం అనే దివ్యాస్త్రంతో అతని తల నరికేశాడు. ధర్మరాజు చాలా సంతోషించాడు.


18వ రోజు :-


పాండవ వ్యూహం - త్రిశూల వ్యూహం

కౌరవుల వ్యూహం - సర్వతోభద్ర వ్యూహం


#విశేషాలు:- దుర్యోధనుని కోరికతో కౌరవ సేనాధిపతిగా శల్యుడు ఉన్నాడు. భీమార్జునులు మిగిలిన కౌరవ సేనను తుడిచిపెట్టసాగారు. యుధిష్ఠిరుని చేత శల్యుడు హతుడయ్యాడు. సహదేవుడు గాంధారసైన్యాన్ని ఊచకోత కోసేశాడు. శకునిని చంపేశాడు. అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ పారిపోయారు. దుర్యోధనుడు పరిసరారణ్యాలకుపోయి ఒక జలాశయంలో దాగున్నాడు. ధర్మరాజు వచ్చి మాటాడిన పరుషవాక్యాలతో దుర్యోధనుడు భీమునితో గదాయుద్ధానికి సిద్ధుడయ్యాడు. భీముడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టి అక్కడవదిలేసి వెళ్ళారు. తరువాత అర్జునుని కపికేతనం, దివ్యాస్త్రాలు అదృశ్యమయ్యాయి. రథం భస్మమైపోయింది. అశ్వత్థామ సుయోధనుని కలిసి #అపాండవం చేస్తానని మాట యిచ్చాడు. (తరువాతి కథ "సౌప్తిక పర్వం"లో ఉంది.)


#యుద్ధ_కార్యక్రమం:-


కురుక్షేత్ర యుద్ధం మొత్తం పద్దెనిమిది రోజుల పాటు జరిగింది. యుద్ధం పగటిపూట మాత్రమే జరిగేది, సూర్యాస్తమయం కాగానే పోరాటాన్ని అపేసేవారు. కురుక్షేత్రం వద్ద గల ఒక విశాల ప్రదేశంలో సైన్యాలు తలపడ్డాయి. ద్వంద్వయుద్ధాలతో పాటు మూకుమ్మడి దాడులు కూడా ప్రతీ రోజూ జరిగే యుద్ధంలో భాగంగా ఉండేవి. రోజువారీ పోరులో విజేతలెవరో, విజితులెవరో నిర్ణయించేది ఆక్రమించుకున్న భూభాగాలు కావు, మృత కళేబరాల సంఖ్య మాత్రమే. మరణం సంభవించేదాకా జరిగే ఈ రణంలో జీవించి ఉన్నవాడే విజేత..

కామెంట్‌లు లేవు: