13, జులై 2023, గురువారం

అధైర్యము నొందరు.

 .   

                  _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*వరమసిధారా, తరుతల వాసో*

*వరమిహ భిక్షా,వరముపవాసః*

*వరమపి ఘోరే నరకే పతనం*

*న చ ధన గర్విత బాంధవ శరణమ్*


తా॥

ధనగర్వంతో మిడిసిపడే బంధువులను ఆశ్రయించటం కంటే?, కత్తి అంచు మీద నడవటం, చెట్టు నీడలో నివసించటం, బిచ్చమెత్తుకోవటం, నిరాహారియై ఉండటం , చివరకు నరకంలో పడటమైనా శ్రేష్ఠం.


---------------------------------------------


𝕝𝕝శ్లోకం𝕝𝕝


ఛిన్నాపి రోహతి తరు: క్షీణోప్యుప చీయతే పునశ్చంద్రః౹

ఇతి విమృశంతః సంతఃసంతవ్యంతే న తే విపదా||


తా॥

చెట్లను కొట్టివేసిన మరల చిగురించుచున్నవి.క్షీణ చంద్రుడు మరల పూర్ణిమ నాటికి 

పరిపూర్ణుడగుచున్నాడు. ఇట్టి ఉదాహరణలు చూచిన ఆపదలు కలకాలముండవని 

తెలియుచున్నది కదా! కావుననే సత్పురుషులెన్నడును ఆపదసమయములందు అధైర్యము నొందరు.

కామెంట్‌లు లేవు: