13, జులై 2023, గురువారం

సంస్కృత సూక్తులు

 🔷🔷🔥🔥🔷🔷


*సంస్కృత సూక్తులు - మూల శ్లోకాలు*


🔷🔥 🔷

శత నిష్కో ధనాఢ్యశ్చ

శత గ్రామేణ భూపతిః 

శతాశ్వః క్షత్రియో రాజా

*శత శ్లోకేన పండితః*


🔥వంద నిష్కలు (బంగారు నాణెములు) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.


🔷🔥🔷


విద్వత్త్వం చ నృపత్వం చ

నైవ తుల్యం కదాచన

స్వ దేశే పూజ్యతే రాజా

*విద్వాన్ సర్వత్ర పూజ్యతే*


🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.


🔷🔥 🔷


శతం విహాయ భోక్తవ్యం

సహస్రం స్నాన మాచ రేత్

లక్షం విహాయ దాతవ్యం

*కోటిం త్యక్త్వా హరిం భజేత్*


🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.


🔷🔥 🔷


అతి దానాత్ హత: కర్ణ:

అతి లోభాత్ సుయోధన:

అతి కామాత్ దశగ్రీవో

*అతి సర్వత్ర వర్జయేత్*


( ఇది మరోవిధంగా కూడా ఉంది)


🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామం చేత రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి.ఎప్పుడూఅతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.


🔷🔥 🔷


సత్యాను సారిణీ లక్ష్మీ

కీర్తిః త్యాగాను సారిణీ

అభ్యాసానుసారిణీ విద్యా

*బుద్ధీ కర్మానుసారిణీ*


🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !


🔷🔥🔷


న నిర్మితో వై నచ దృష్ట పూర్వో

న శ్రూయతే హేమమయం కురంగమ్ 

తథాఽపి తృష్ణా రఘునందనస్య

*వినాశకాలే విపరీత బుద్ధిః*


🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.


🔷🔥 🔷


ఋణ కర్తా పితా శత్రుః 

మాతా చ వ్యభిచారిణీ

భార్యా రూపవతీ శత్రుః 

*పుత్రశ్శత్రు రపండితః*


🔥 అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.


🔷🔥 🔷


ఆత్మ బుద్ధిః సుఖం చైవ

గురు బుద్ధిర్విశేషతః 

పర బుద్ధి ర్వినాశాయ

*స్త్రీ బుద్ధీ ప్రళయాంతకః*


🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !



🔷🔥 🔷


ముఖం పద్మ దళాకారం

వచ శ్చందన శీతలం

హృదయం కర్తరీ తుల్యం

*అతి వినయం ధూర్త లక్షణమ్*


🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా. 


🔷🔥 🔷


సిద్ధ మన్నం ఫలం పక్వం

నారీ ప్రథమ యౌవ్వనం

కాలక్షేపం నకర్తవ్యం

*ఆలస్యం అమృతం విషమ్*

కామెంట్‌లు లేవు: