12, ఆగస్టు 2023, శనివారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 10*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 10*


*కులం అంటే ఏమిటి?*


నరేంద్రుని తండ్రి ప్రఖ్యాత న్యాయవాది కావడం వలన వ్యాజ్యం విషయంగా అనేక మంది వారి ఇంటికి వచ్చిపోతూవుండేవారు. వారిలో విభిన్న కులాలకు చెందిన వారు ఉండేవారు. నాటి కుల పట్టింపులకు తగ్గట్లు విభిన్న కులాల వారికి వేర్వేరు హుక్కాలు విశ్వనాథుడు అమర్చి ఉంచేవాడు. ' ఈ కులం విషయం నరేంద్రుడికి ఎంతమాత్రం అంతుబట్టేది కాదు. 


ఒక కులంవారి హుక్కాతో మరొక కులంవారు పొగత్రాగితే ఏమవుతుంది? ఇంటి కప్పు కూలిపోతుందా? ప్రాణాలు పోతాయా, ఏమవుతుంది? ఇందుకు జవాబుకై అతడు తపన చెందాడు. 


ఒక రోజు స్వయంగా తనే చేసి చూడాలని అతడు నిశ్చయించాడు. ఎవరూ లేని సమయంలో తిన్నగా ఆ గదిలో వెళ్లాడు. ప్రతి హుక్కా నుండి ఒకసారి పొగత్రాగి చూశాడు. ఏమీ జరగలేదు! తను చనిపోలేదు! మరెందుకు కుల వివక్షలు అని అతడి మనస్సు ప్రశ్నించింది. అదేసమయంలో విశ్వనాథుడు అక్కడకు వచ్చాడు. 


“నరేంద్రా! ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు, "ఏంలేదు నాన్నా! కుల పట్టింపు ను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో చూశాను. కాని ఏమీ జరగలేదు" అని జవాబు ఇచ్చాడు.   నవ్వి కుమారుణ్ణి తదేకంగా చూసి విశ్వనాథుడు అక్కణ్ణుండి వెళ్లిపోయాడు. కుల పట్టింపుల పేరిట ఏర్పడ్డ మూఢనమ్మకాలను అతడు నిరసించాడు.


విశ్వనాథ్ కక్షిదారైన ఒక మహమ్మదీయుణ్ణి నరేంద్రుడు 'మామా' అంటూ సంబోధిస్తూ, ఆయనతో చనువుగా మెలగేవాడు. ఆ పెద్దమనిషి ఇచ్చే తీపిభక్ష్యాలను తినేవాడు. ఇతరులు అది చూసి ఆశ్చర్యపోయేవారు. కాని తండ్రి మాత్రం కుమారుని ఆ చేష్టను చూసి నవ్వుకొంటూ వెళ్లిపోయేవాడు.


(హుక్కా (hubble-bubble) అనే పొగత్రాగే గొట్టం ద్వారా పొగత్రాగడం దేశంలో సామాన్యంగా ప్రతి ఇంట్లో ఒక సంప్రదాయంగా పరిగణించేవారు. దక్షిణ భారత దేశంలో ఇంటికి వచ్చే అతిథులకు తాంబూలం ఇచ్చి ఉపచర్య చేసే విధంగా, వంగదేశంలో అతిథులను హుక్కాతో పొగత్రాగమనడం రివాజు).🙏


*సేకరణ: శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: