12, ఆగస్టు 2023, శనివారం

నారాయణీ అంటే

 నిత్యాన్వేషణ:

నారాయణీ అంటే లక్ష్మీదేవి పేరా లేదా పార్వతీ దేవి పేరా? 


సంస్కృతంలో (పురాణాలలో, …) పేర్లు లక్షణాలను బట్టి, చేసిన కార్యాలను బట్టి వుంటాయి. సహస్రనామాలలో కనిపించే పేర్లన్నీ యీ విధమైనవే. కాబట్టి ఒకే లక్షణమున్న వారందరకీ కూడా ఒకే పేరును వాడవచ్చు. సందర్భాన్ని బట్టి 'హరి' అంటే వీరిలో ఎవరైనా కావచ్చు విష్ణువు; ఇంద్రుఁడు; సూర్యుఁడు; చంద్రుఁడు; యముఁడు; …

ఆ విధంగానే … నారాయణీ అంటే నారాయణుని శక్తి.

ఉత్పాదినీశక్తి బ్రహ్మాణి; పాలినీశక్తి నారాయణి; సంహారిణీశక్తి రుద్రాణి. ఈ అర్థంలో దుర్గ, పార్వతి, లక్ష్మి, గంగ - ఈ అందరికీ కూడా నారాయణీ అని వాడారు.

దుర్గాసప్తశతిలో ప్రముఖ శ్లోకాలు:

*శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే౹*

*సర్వ స్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే॥*

*సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే౹* 

*శరణ్యేత్ర్యంబక దేవి నారాయణి నమోస్తుతే॥*

మరియు 11 అధ్యాయంలో నారాయణి ప్రయోగం ఎక్కువగా కనిపిస్తుంది.

కామెంట్‌లు లేవు: