30, ఆగస్టు 2023, బుధవారం

మొదటి* *భాషగా సంస్కృతం✍️📚*

 *📚✍️పాఠశాల విద్యలో మొదటి*

 *భాషగా సంస్కృతం✍️📚*


*♦️ఆరో తరగతి నుంచి ఎంపికకు అవకాశం*


*♦️ప్రభుత్వ పరిశీలనలో ప్రతిపాదన*


*🌻ఈనాడు, అమరావతి*: పాఠశాల విద్యలో మొదటి భాషగా సంస్కృతం సబ్జెక్టును తీసుకురాబోతున్నారు. పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వ నికి పంపింది. త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. మొదటి భాషగా దీన్ని ఎంచుకున్న విద్యార్థులు రెండో భాషగా హిందీకి బదులు తెలుగు సబ్జెక్టు చదవాల్సి ఉంటుంది. మూడో భాషగా ఆంగ్లం ఉంటుంది. తెలుగు సబ్జెక్టును మొదటి భాషగా తీసు కున్న వారు రెండో భాషగా హిందీ చదవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఆరో తరగతిలో మొదటి భాషను ఎంపిక చేసుకునే

అవకాశం కల్పిస్తారు. సంస్కృతం పుస్తకాలు ఆరో తరగతి నుంచి ఉన్నాయి. పదో తరగతి పరీక్షల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం కాంపొజిట్ తెలుగును తొలగించింది. ఇందులో తెలుగు 70 మార్కులు, సంస్కృతం 30 మార్కులకు ఉండేది. తెలుగునే వంద మార్కులకు చేసినందున సంస్కృతం సబ్జెక్టుకు అవకాశం కల్పించాలనే డిమాండ్ వచ్చింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కృతం ఉపాధ్యాయులు పని చేస్తు న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్నడ, తమిళం, ఒడియా, హిందీ, ఉర్దూ మొదటి భాషగా చదువుతున్న విద్యార్థులు 10వేల వరకు ఉన్నారు. ఇప్పుడు సంస్కృతం తీసుకువస్తే ఈ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. సంస్కృతంలో ఎక్కువ మార్కులు సాధించే వీలుంది. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ మంది ఈ సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంది.


🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

కామెంట్‌లు లేవు: