30, ఆగస్టు 2023, బుధవారం

విలువుండని(విలువెరుగని) వారలతో


*కం*

విలువుండని(విలువెరుగని) వారలతో

విలువగు సమయంబునెల్ల వెచ్చించినచో

అలతులు బల్లిదులగుదురు

విలువగు నీ విలువలెల్ల వెడలును సుజనా.

*భావం*:-- ఓ సుజనా! విలువ లేని వారి తో విలువైన సమయమంతా గడపడం వలన ఆ అల్పులు బలవంతులై విలువైన నీ విలువ లన్నీ తగ్గిపోవును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


*కం*

వంశజనులపెంచగనే

వంశోధ్ధారకులుగారు పరిగణమొనరన్(ప్రముఖులు మెచ్చన్)

వంశ(పు)ప్రతిష్ఠ బెంచగ

వంశోధ్ధారకుడనబడు పదపడి (బలముగ)సుజనా

*భావం*:-- ఓ సుజనా! వంశం లో జనులను పెంచినంతమాత్రాన వంశోధ్ధారకుడనబడరు. పరిగణించేస్థాయిలో వంశం యొక్క ప్రతిష్ఠ పెంచినప్పుడే వంశోధ్ధారకుడనబడును.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: