30, ఆగస్టు 2023, బుధవారం

సాంఖ్య యోగః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️* 

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 


 *2-అధ్యాయం, 12వ శ్లోకం* 


 *నత్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |* 

 *న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్|| 12* 


 *ప్రతిపదార్థం* 


అహామ్ = నేను; జాతు =ఒకప్పుడును ; న, ఆసమ్ తేను - అనునది;న, తు, ఏవ =లేనే లేదు; త్వమ్ = నీవు;న ( ఆసీః )= లేవు.- అనునది" లేదు; ఇమే ఈ ; జనాధిపాః = రాజులు;న (ఆసన్) = 'లేరునునది 'యును లేదు;చ = మరియు; అతః, పరమ్ . ఇక మీదట; వయమ్, సర్వే = మనము అందరము ;న, భవిష్యామః = " లేకపోవుట  " యనునది;న, ఏవ = లేనే లేదు;


 *తాత్పర్యము* 


 నీవుగాని, నేనుగాని, ఈ రాజులుగాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు.( అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మశాశ్వతము. అది అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో అది నశించునది కాదు. )


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

కామెంట్‌లు లేవు: