29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 38*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 38*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*సమున్మీల త్సంవిత్కమల మకరందైకరసికం*

*భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం |*

*యదాలాపా  దష్టాదశగుణిత విద్యాపరిణతిః*

*యదాదత్తే దోషా ద్గుణ  మఖిల మద్భ్యః పయ ఇవ ‖*



ఈ శ్లోకంలో అనాహత చక్రంలో (హృదయ స్థానం వాయు తత్త్వం) శివ, శక్తులు ఎలా వున్నారో చెప్తున్నారు.


వీరు ఇక్కడ హంస, హంసిగా ఉన్నారట. హంసలు మానస సరోవరంలో ఉంటాయి.


కిమపి మహతాం మానసచరం = ఎవరో కొద్దిమంది మహాత్ముల మానసముల యందు హంస జంట వలే చరిస్తారట.


హంసలకు విచ్చుకున్న కమలములలోని మకరందం ఇష్టమట. అందుకని


సమున్మీలత్ సంవిత్కమల మకరందైకరసికం = బాగా వికసించిన జ్ఞానమనే కమలంలోని మకరందాన్ని ఆస్వాదిస్తుంది ఈ హంసద్వయం. అది జ్ఞానానందము. దానిని పొందాలంటే, ఈ హంస ద్వంద్వముతో తాదాత్మ్యం చెందినవారికే సాధ్యమవుతుంది.


యదాలాపా దష్టాదశగుణిత విద్యాపరిణతిః = అష్టాదశ విద్యలు అంటే వేదములు, వేదాంగములు. నాలుగు వేదములు, నాలుగు ఉపవేదములు, షడంగములు, పురాణ, న్యాయ, మీమాంస, ధర్మ శాస్త్రములు.


నాదం సంపూర్ణంగా వికసించి రూపుదిద్దుకొనే స్థానం అనాహతం. ఆహతం అంటే శబ్దం స్ఫుటంగా వినబడనిది. ఇంతకుముందు చెప్పుకున్నాము. పరమాత్మ  ప్రాణశక్తిగా ముందు జీవుడి మూలాధారంలో అతి సూక్ష్మమైన నాద రూపంగా ప్రవేశిస్తాడనీ, అక్కడ నుండి నాభియందున్న మణిపూర చక్రాన్ని చేరి అప్పుడు కొంత దిటవై ఆ నాదము "పశ్యంతి" గా మారుతుందని, ఆ తరువాత అనాహత కమలాన్ని చేరి 'మధ్యమం' గా, 'వైఖరి' గా మారి వర్ణరూపాన్ని(అక్షర రూపాన్ని) ధరిస్తుందనీ.


యదాదత్తే దోషాద్ గుణ మఖిల మద్భ్యః పయ ఇవ = హంస పాలు మాత్రమే తీసుకొని నీటిని వదిలేస్తుందట. అట్టి హంసద్వంద్వాన్ని భజిస్తున్నాను అని ఇక్కడ అంటున్నారు.


అలాగ ఆ హంస మిధునమును ధ్యానించి వారికి వారి గత జన్మల పాపములను ప్రక్కన పెట్టి వారి సద్గుణములను మాత్రమే స్వీకరించి మోక్షమును అనుగ్రహిస్తారట పరమేశ్వరుడు పరమేశ్వరి.   


వేదములు

ఋక్, యజుః, సామ, అథర్వ వేదాంగములు .


శీక్షా

శబ్దాలంకారములు, వ్యాకరణము, ఛందస్సు  నిరుక్తము 

మాటల/పదముల పుట్టుక, పరిణామక్రమము


జ్యోతిషము 


కల్పము 

వైదిక కార్యక్రమముల నిర్వహణకు  మార్గదర్శకములు.

ఉప వేదములు: ఆయుర్వేదము (ఋగ్వేదం)  ధనుర్వేదము (యజుర్వేదము)

గాంధర్వ వేదము (సామ) 

అర్థశాస్త్రము, శిల్ప శాస్త్రము (అథర్వ వేదము)


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: