29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* *🌸 సాంఖ్య యోగః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,41 వ శ్లోకం*


 *వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కూరునందన |* 

 *బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినామ్ || 41* 


 *ప్రతిపదార్థం* 


కురునందన = ఓ అర్జునా! ; ఇహ = ఈ ( నిష్కామ ) కర్మ యోగము నందు ; వ్యవసాయాత్మికా బుద్ధిః = నిశ్చిమాత్మకమైన బుద్ధి; ఏకా ( భవతి ) =ఒకటిగా ఉండును. ; అవ్యవ సాయినామ్ = ( కాని ) స్థిర బుద్ధి లేని వివేకహీనులైన సకామ మనుష్యుల యొక్క ; బుద్ధయః = బుద్ధులు ;హి = నిశ్చియముగా;బహుశాఖాః = అనేక భేదములు గలిగిన వై ( చంచలములై ); చ = మరియు; అనంతాః = అంతులేని (కోరికలు గల ) వై ( ఉండును.);


 *తాత్పర్యము* 


 ఓ అర్జునా! ఈ (నిష్కామ ) కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి ఒక్కటియే యుండును. కానీ భోగాసక్తులైన వివేక హీనుల బుద్దులు చంచలములై, ఒక దారి తెన్ను లేక కోరికలవెంట నలువైపులా పరుగలు తీయుచూ అనంతములుగా నుండును.


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

కామెంట్‌లు లేవు: