29, సెప్టెంబర్ 2023, శుక్రవారం

ఆరోగ్యమే మహా భాగ్యం

 ((((( ఆలోచనాలోచనాలు )))))  ఆరోగ్యమే మహా భాగ్యం మరియు మన పెన్నిధులు🙏🕉️🙏             ***** మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారనుకోండి! మీ సిరిసంపదలు, ఏమిటని? మీరు వెంటనే జవాబివ్వండి. మొదటిది, రెండవది మరియు నూరవది కూడా "" మంచి ఆరోగ్యం"" అని! "ఆరోగ్యమే మహా భాగ్యం."  దానిని సంపాదించేందుకు శ్రమ పడనక్కరలేదు. కానీ పోగొట్టుకోకుండా మిక్కిలి శ్రమపడాల్సివుంటుంది. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనకు దాని విలువ తెలియదు. పోగొట్టుకున్న తర్వాత ఏడ్చిమొత్తుకున్నా అది మన చేజిక్కదు. అదే వింత విషయం.                              ***** మనల్ని ప్రేమించేవారిని ఆదరిద్దాం.       మన అవసరం ఉన్నవారికి సహాయపడదాం.                   మనల్ని కష్టపెట్టేవారిని క్షమించి వదిలేద్దాం.                మనల్ని విడచివెళ్ళేవారిని మరచిపోవడానికి ప్రయత్నిద్దాం.                        పై నాలుగు విషయాలు మనం పాటిస్తున్నామంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లే!    ***** రాత్రి పొద్దుపోకముందే నిద్రపోవాలి.                           ఉదయాన్నే చీకటి ఉండగానే నిద్రలేవాలి.             ఆకలి అయినప్పుడే భోజనం చెయ్యాలి.                ప్రాప్తం ఉన్నది మాత్రమే మనకు చెందుతుందని విశ్వసించాలి.                           ఇప్పుడు మీరు భాగ్యవంతులు, వివేకవంతులు మరియు ఆరోగ్య వంతులు కూడా!        ***** మానవ జీవితాన్ని తెరమీది"" సినిమా"" లాగా రెండు భాగాలుగా విభజిద్దాం. ఇంటర్వెల్ ముందు డబ్బు సంపాదన యావలోపడి ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టడం. ఇంటర్వెల్ తరువాత డబ్బును, సమయాన్ని విపరీతంగా ఖర్చుచేసుకొని " ఆరోగ్యాన్ని" కొనుక్కోవడం.        ఇక రెండవ అంశం "" మన పెన్నిధులు.""                         ***** సత్యాన్నే పలకండి. క్రోధాన్ని వదలండి. ఎవరైనా మీ ముందు చెయ్యి చాపితే కొంచెం అయినా వారి చేతిలో ఉంచండి. - - - గౌతమ బుద్ధుడు.                              ***** నేను మీకు మూడు విషయాలను మాత్రమే ఉపదేశిస్తాను. అవి 1* సరళత్వం 2* సహనం 3* కారుణ్యం . - - - తత్వవేత్త లావొట్సూ.                            ***** తప్పు చెయ్యడం మానవ సహజం. కానీ తప్పుల్ని మాత్రమే చేస్తూ ఉండడం రాక్షసత్వం. చేసిన తప్పును ఒప్పుకొని, మరొకసారి చెయ్యకుండా ఉండడం దైవీలక్షణం. అన్నిటికి మించి ఎదుటివ్యక్తి తప్పును క్షమించగలగడం దైవీలక్షణం! అదే మహత్ముల బలం.                  ***** మనం మన తల్లిదండ్రులను గౌరవించాలి. ఎందుకంటే వారు "" ఇంటర్నెట్"" "" స్మార్ట్ ఫోన్"" లు లేని కాలంలో కూడా కష్టపడి చదువుకొన్నారు గనుక. మనల్ని ఈ అధునాతన సాంకేతిక వ్యవస్థలో చదివించారు గనుక.              *******************************                              Answers to Sharpen your mind!                         1* Fish 2* Humanity 3* The sun 4* A bee.       - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -                                 తెలుగు నుడికారం ( సామెతలు మరియు జాతీయాలు)                             1* మగవాడి అబద్ధాలా? అవి సూదులను మూటగట్టినట్లు.                   2* పూటకూళ్ళమ్మ పుణ్యం ఎరుగదు.                              3* సీతాపతీ! చాపేగతి.            4* చేసుకొన్నంతవారికి చేసుకొన్నంత మహదేవ!             5* సుబ్బిపెళ్ళి , వెంకి చావుకు వచ్చిపడింది.           6* అయినా తాతకు దగ్గులు నేర్పడమేమిటి?          7* చూచిరమ్మంటే కాల్చివచ్చాడు.( హనుమంతుడు)                8* ఆకలి రుచెరుగదు; నిద్ర సుఖమెరుగదు.                    9* ముసలితనాన పడుచు పెళ్ళమా? గడ్డివామి దగ్గర కుక్క కాపలా!                        10* వాడు ప్రతి పనికి సైంథవుడిలా అడ్డుపడుతుంటాడు.            తేది 29--9--2023, శుక్రవారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: