5, అక్టోబర్ 2023, గురువారం

*శ్రీ దేవీ భాగవతం

 *శ్రీ దేవీ భాగవతం*



.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


తల్లి ఎంత చెప్పినా దమయంతి వినిపించుకోలేదు. తన నిశ్చయం మార్చుకోలేదు. ఇంకా

స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది.

అమ్మా! ధనమూ రూపమూ అందమైన ముఖమూ ఇవ్వి ఉండి ఏమి లాభం, మనిషి

మూర్ఖుడయ్యాక. రసమార్గం తెలియని మనిషికి రాజ్యం ఉండి ఏమి ప్రయోజనం ? నాదమాధుర్యాన్ని

ఆస్వాదిస్తూ అరణ్యాలలో హాయిగా సంచరించే హరిణీబృందాల బ్రతుకు ధన్యం. అవి ఆ మాధుర్యానికి

వివశలై మూర్ఖమానవుల చేతికి చిక్కి ప్రాణాలు విడిచిపెడుతున్నాయి. నారదుడు సప్తస్వరాత్మకమైన

సంగీతవిద్యకు నిధి. అందులో అతడికి సాటివచ్చేవాడు ముల్లోకాలలోనూ లేడు ఒక్క శివుడు తప్ప

ఇలాంటి విద్వాంసుడిని వదలుకుని ఒక మూర్ఖుడితో కాపురం చెయ్యడం క్షణం క్షణం మరణం. ధనమూ

రూపమూ ఉన్నా గుణం లేకపోతే అతడిని పరిత్యజించవలసిందే. గర్వగరిష్ఠులైన రాకుమారులతో మైత్రి

అంటేనే నాకు అసహ్యం. అంతకంటే గుణగరిష్ఠుడైన భిక్షువుతో చెలిమి నాకు ఇష్టం. ఇతడు సర్వజ్ఞుడు.

సంగీతంలో గ్రామమూర్ఛనాభేదాలను కూలంకషంగా ఎరిగినవాడు. దుర్బలుడైనా ఎనిమిది రసాలూ

తెలిసినవాడు. ఇటువంటి వరుడు దొరకడమే ఒక అదృష్టం. గంగా సరస్వతినదులు ఎలా కైలాసానికి

తీసుకువెడతాయో అలాగ స్వరజ్ఞాన విశారదుడైన ఈ నారదుడు నన్ను తీసుకువెడతాడు. స్వరప్రమాణాలు

తెలిసినవాడు మానవుడైనా దేవతకింద లెక్క. సప్తస్వరాలు తెలియనివాడు ఇంద్రుడైనా పశువుతో

సమానం.

స్వరమావం తు యో వేద సదేవో మామషోఽపి పవ్

సప్తభేదం న యో వేద స పశుః సురరాడపి

మూర్ఛనా తానమార్గం తు శ్రుత్వా మోదం నయాతి యః ప సపశుస్సర్వథా జ్ఞేయో హరిణాః పశవో న హి |

వరం విషధరః సర్పః శ్రుత్వా వాదం మవోహరమ్ ।

అశ్రోత్రోఽపి ముదం యాతి ధిక్సకర్ణాంశ్చ మానవావ్

బాలోఽపి సుస్వరం గేయం శ్రుత్వా ముదితమానసః ।

జాయతే కింతు యే వృద్ధా నజానంతి ధిగస్తు తాన్||

కామెంట్‌లు లేవు: