5, అక్టోబర్ 2023, గురువారం

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *ప్రథమాశ్వాసము*


                      *14*


*ప్రమద్వరను బ్రతికించుట*


రురుడు శోకిస్తూ ప్రమద్వరను బ్రతికించమని దేవతలను " ఓ దేవతలారా ! ఓ బ్రాహ్మణులారా ! నేను దేవ యజ్ఞములు, వేదాధ్యయనం, వ్రతములు, పుణ్యకార్యములు చేసిన వాడిని అయితే, నేను నా గురువులను భక్తితో సేవించిన వాడిని అయితే, నేను ఘోరమైన తపసు చేసిన వాడిని అయితే నా ప్రేయసి ప్రమద్వర మీ దయ వలన విషం నుండి విముక్త కాగలదు" అని ప్రార్థించాడు. తిరిగి " మంత్ర తంత్రములు తెలిసిన వారు విషతత్వ శాస్త్రములు తెలిసిన వారు ఎవరైనా ప్రమద్వర విషమును హరిస్తే అతడికి నా తపః ఫలమును, అధ్యయన ఇలమును ధారపోస్తాను. " అని రోదించాడు. అప్పడు ఆకాశం నుండి ఒక దేవత " బ్రాహ్మణోత్తమా !ప్రమద్వర కాలవశమున మరణించింది. ఆయుస్షు తీరింది కనుక దానిని ఆపడం ఎవరి తరం. అయినా దానికి నేను ఒక ఉపాయం చెప్తాను. ఎవరైనా తమ ఆయుష్షులో సగం ఇస్తే ఆమె ముందరి కంటే తేజస్సుతో బ్రతుకుతుంది అని నేను యమధర్మరాజు అనుమతితో పలుకుతున్నాను " అని పలికాడు. రురుడు అందుకు అంగీకరించి తన ఆయుర్ధాయంలో సగం ఇచ్చి ఆమెను బ్రతికించి వివాహం చేసుకున్నాడు.

కామెంట్‌లు లేవు: