5, అక్టోబర్ 2023, గురువారం

భోజనమునకు ఉపయోగించదగిన పాత్రలు

 భోజనమునకు ఉపయోగించదగిన పాత్రలు మరియు ఆకు విస్తళ్ళు - 


 *  బంగారు పాత్ర యందు భోజనము మంగళప్రదమైనది . జఠరాగ్ని వృద్ది చెందును .వీర్యవృద్ధి కలుగచేయును . మంచి చూపును ఇచ్చును . పైత్యవికారాలను అణుచును . శరీరానికి గొప్ప మేలు చేయును . 


 *  వెండిపాత్ర యందు భుజించిన పిత్తం ఎక్కువగును . శ్లేష్మాన్ని హరించును . వాతాన్ని చేయును . అరుచి ( ఏమి తిన్నా రుచి లేకుండా ఉండు సమస్య ) పోగొట్టును . శరీరానికి కాంతిని ఇచ్చును . వెండి ప్లేట్ మధ్యలో బంగారముతో తాపడం చేయించి అందులో భుజించుట కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును . 


 *  కంచు పాత్రలో భుజించిన రక్తపైత్యము హరించును . హృదయానికి బలాన్ని ఇచ్చును . బుద్ధిని పెంచును . శరీరము నందు జఠరాగ్ని పెంచును . శరీరానికి కాంతిని కలుగచేయును . ఎముకల వృద్ది అగుటకు తోడ్పడును . ఎముకల బలానికి సహాయపడును . 


 *  స్టెయిన్ లెస్ స్టీల్ , ఇనుము పాత్ర యందు భుజించిన శోధన ( Asitis ) , పాండురోగము ( Anemia ) సమస్యలను పోగొట్టును . కామిల వ్యాధి ( కామెర్లు ) నివారణ అగును . వీర్యవృద్ధి , జఠరాగ్ని పెంచును . ఈ పాత్రలను శుభ్రపరుచుట సులభము . 


 *  అల్యూమినియం పాత్ర యందు వండుట మరియు భోజనం చేయుట అత్యంత ప్రమాదకరం . ఈ పాత్రల యందు వండు సమయము నందు దీని యందలి విషము కొంచం కొంచం వండిన ఆహారాల యందు కలిసి రక్తదోషాలు ఏర్పడి చర్మరోగాలు వచ్చుటయే కాక , జఠరాగ్ని మందగించి శరీరము విషతుల్యమై అనేక రోగాలు సంప్రాప్తించును . 


 ఆకు విస్తర్ల యందు భోజనం చేయుట వలన ఉపయోగాలు - 


 *  అరటి ఆకు యందు భోజనము మిక్కిలి పరిశుభ్రముగా ఉండును . వాతాన్ని హరించును . బలము , ఆరోగ్యము వృద్ధిచెందును . శరీరకాంతి , సంభోగశక్తి పెంపొందించును . ఆకలిని మరియు దంతకాంతిని కలిగించును . పైత్యమును శాంతిప చేయును . శ్లేష్మవికారాలు , వొళ్ళు నొప్పులు తగ్గును . శరీరము నందలి క్రిములు నాశనం అగును . ఉదరము నందలి పుండ్లు ( peptic ulcers ) తగ్గించును . 


 *  మోదుగ ఆకు విస్తరి యందు భుజించుట వలన గుల్మరోగము ,మహోదరము , క్రిమిరోగము , రక్తసంబంధ రోగములు , పిత్తరోగములు నివారణ అగును . బుద్దిని పెంచును . మోదుగ చంద్ర సంబంధ వృక్షము . చంద్రుడు మనః కారకుడు అందుచే ఈ విస్తరి యందు భుజించటం చేత సాత్విక గుణములు కలుగును . 


 *  మర్రి ఆకుల విస్తరి యందు భుజించటం వలన క్రిమిరోగ  నివారణ అగును. వ్రణములు , పైత్యం పొగొట్టును . కుష్ఠు రోగమును హరించును . నేత్రదోష నివారణ చేయును . వీర్యవృద్ధి కలిగించును . 


 *  రావి ఆకు విస్తరి యందు భుజించిన పిత్తము , శ్లేష్మము నివారణ అగును . అగ్నివృద్ధి కలిగించును . జననేంద్రియ దోషములు నివారణ అగును . విద్యార్జనకు కావలసిన ఆసక్తిని కలుగచేయును . 


 *  పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది , పిత్తహర గుణములు ఉండును . 


 *  తామర ఆకు విస్తరి యందు భుజించిన విషహరముగా ఉండును . సరస్సులో ఉన్న ఆకు భుజించుటకు పనికిరాదని " అహ్నిక ప్రకాశం" అను గ్రంథములో ఉన్నది . 


 *  వక్కపెట్ట భోజనమునకు వాడుట కొన్ని ప్రదేశాలలో ఉన్నది. తిన్నతరువాత పళ్ళెము వలే కడిగి మరలా భుజించటం కూడా ఉన్నది . ఇది అగ్నివృద్ది చేయును . దీని నుంచి వాతపిత్తరోగములు హరించును . 


   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                           9885030034  


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


        కాళహస్తి వేంకటేశ్వరరావు 


   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


           9885030034

కామెంట్‌లు లేవు: