13, అక్టోబర్ 2023, శుక్రవారం

ఉద్ధవగీత

 ఉద్ధవగీత 

శ్లో)తప్తజాంబూనదప్రఖ్యం శంఖచక్రగదాంబుజైః| లసచ్చతుర్భుజం శాంతం పద్మకింజల్క వాససమ్ |I


స్ఫురత్కిరీటకటక కటిసూత్ర వరాంగదమ్ | 

శ్రీవత్సవక్ష సంభ్రాజత్కౌస్తుభం వనమాలినమ్ || 


ధ్యాయన్న భ్యర్చ్య దారూణి హవిషాభిఘృతాని చ | ప్రాస్యాజ్యభాగావాఘారౌ దత్త్వా చాజ్యప్లుతంహవిః||


జుహుయాన్మూలమం త్రేణ షోడశర్చానదానతః | ధర్మాదిభ్యో యథాన్యాయం మంత్రైః స్విష్టకృతం బుధః ||



అ)తరువాత అగ్నియందు తప్తకాంచనవర్ణము, శంఖచక్రగదాపద్మ లచే విరాజిల్లు చతుర్భుజయుక్తము, ప్రశాంతము, పద్మకేసరములవలె పచ్చనైన వస్త్రముచే శోభితము, ప్రకాశించు కిరీట కటక కటిసూత్రనూపుర సమన్వితము, శ్రీవత్సవక్షము, చక్కగ తేజరిల్లు కౌస్తుభమణిచే విరాజితము, వనమాలావిభూషితము నగు నా రూపమును ధ్యానించి పూజింపవలెను. పిమ్మట ఘృతసిక్తములైనసమిధలను.అగ్నియందాహుతినీయవలెను. ఆఘారము, ఆజ్యభాగము ననురెండు రెండాహుతులతో హవనము జేయవలెను. అనంతరము ఇంకను ఘృతసిక్తము లైన హవిస్సులనీయవలెను. అటుపిమ్మట 'ఓం నమో నారాయ అష్టాక్షరమంత్రముతోను, పురుషసూక్తమునందలి పదునాఱుమంత్రముల తోను హవనము చేయవలెను. బుద్ధిమంతు, డగుపురుషుడు ధర్మాధిదేవతలకు యథావిధిగ స్వాహాన్తమంత్రములచే స్విష్టకృతమునుహోమము చేయవలెను.

కామెంట్‌లు లేవు: