20, ఏప్రిల్ 2025, ఆదివారం

అబద్ధాలు” లేవు,

 “ స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ “మరణం”లేదు, భగవద్గీతలో అన్నీ ఉన్నాయి,

కానీ “అబద్ధాలు” లేవు,


లోకంలో అన్నీ ఉన్నాయి కానీ సమాజంలో “ప్రశాంతత” లేదు మరియు ఆస్తులు, అంతస్తుల ఊబిలో కూరుకుపోయిన మనిషికి అన్నీ ఉన్నా అతనికి “మనశ్యాంతి” లేదు.”


ఏమి తీసుకురాకుండా వచ్చి,

ఏమీ పట్టుకుపోకుండా పోతాం

అని తెలిసికూడా.... 

కంటికి నచ్చింది, మనస్సుకు మెచ్చింది, విసుగు, విరామం లేకుండా కావాలనుకుంటూ పరుగులు పెడుతూ, ఇంకా ఏదో కావాలనుకుంటూ

ఓపిక ఉన్నన్నాళ్లు గడిపేస్తాం. ఎన్ని కోరుకున్నా, ఏది కోల్పోయినా, ఉన్నది పోదు, లేనిది రాదు అని తెలుసుకునే సరికి జీవితం గడిచిపోతుంది.

చిత్రంగా మొదలై విచిత్రంగా ముగిసిపోయేదే మానవజన్మ... 🙏

కామెంట్‌లు లేవు: