*2083*
*కం*
డబ్బుకు తలొంచులోకము
జబ్బున పడినపుడు డబ్బు జనియించునిలన్.
డబ్బుకు ప్రాణము లుండవు
నబ్బురముగ గెలుచు డబ్బు లవనిన సుజనా.
*భావం*:--- ఓ సుజనా! డబ్బు కు లోకం తలవంచుతుంది. జబ్బు చేసి నప్పుడు డబ్బు అప్పుల రూపంలో పుడుతుంది. డబ్బు కు ప్రాణం ఉండదు కానీ అద్భుతముగా డబ్బు ఈ భూలోకంలో గెలుస్తుంది.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి