20, ఏప్రిల్ 2025, ఆదివారం

అదుగో

 అదుగో…

పర్వత సానువులు…

ఆ సానువుల్లో ఉబికి వస్తున్న ఝరీనాదాలు…


శిలాలోగిళ్లలో దుముకుతూ,

శిలాకౌగిళ్లలో నిమేషము ఒదుగుతూ,

తమ తనువులలో స్పందనలను నాదాలుగా నినదించి,

నేలమ్మ ఒడిలోకి ప్రవహించ 


డాంబిక ఢమరుక శబ్దాలై…

వినుత వీణానాదాలై…

తంబుర తరంగ సవ్వడులై…

సుస్వన సన్నాయి సద్దులై…


రంజిల్లు రవళుల రాగాలై…

హళాహళియై…

కోలాహలమై…

వీనుల విందై…

తనువుల స్పందనలై…


ఆ పుణ్యగాత్రాల సుస్వరాలై…

సంగీత ప్రపంచ పరిచయాలై…

ఆనందడోలికల ఓలలాడించు 

హొయలై…

లయలై…


నినదించు వేళ…!

మనసులకు పులకరింతల హేల…!


~ రావుల గిరిధర్, ఐపీఎస్.

19-04-2025.

కామెంట్‌లు లేవు: