*కం*
అధికారము లభియించగ
సుధిజనపోషణముజేయ సుషముడవయ్యున్.
మధురంబగు భవితలెపుడు
సుధిగణములు తెలుపగలరు సుష్టుగ సుజనా.
*భావం*:-- ఓ సుజనా! అధికారం లభించిన పుడు విద్వాంసులను పోషిస్తే బాగుగా వెలుగొందగలవు. మధురమైన భవిష్యత్తులు పండితులు బాగా తెలుపగలరు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ**
*
*కం*
ఇలలో సిరులార్జించగ
నిల సౌఖ్యములందగలుగు నెవ్వరికైనన్.
కలిగిన సౌఖ్యము క్షణికము
సలిపిన ధర్మమ్ము నిలుచు సతతము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! ఈ లోకంలో సిరిసంపదలు సంపాదించిన చో ఈ లోకంలో ని సౌఖ్యములు ఎవ్వరికైననూ లభించగలవు. కానీ అనుభవించిన సౌఖ్యములు క్షణికములు కానీ చేసి న ధార్మిక కర్మలు మాత్రం ఎల్లకాలమూ నిలుచును.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి