శ్రీమద్భగవద్గీత: ఐదవ అధ్యాయం
కర్మసన్యాసయోగం: శ్రీ భగవానువాచ:
స్పర్శాన్‌కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ (27)
యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః (28)
బాహ్యవిషయాలమీద ఆలోచనలు లేకుండా, దృష్టిని కనుబొమల మధ్య నిలిపి, ముక్కులోపల సంచరించే ప్రాణాపానవాయువులను సమానం చేసి, ఇంద్రియాలనూ, మనస్సునూ, బుద్ధినీ వశపరచుకుని, మోక్షమే పరమలక్ష్యంగా ఆశ, క్రోధం, భయం విడిచిపెట్టిన ముని నిరంతరమూ ముక్తుడై వుంటాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి