21, జులై 2020, మంగళవారం

గురువు ఎప్పుడూ సాధనలో పరిణామం చూడరు ! నాణ్యతనే చూస్తారు !!

అనినా, వినినా, కనినా, తలుచుకున్నా... దైవనామం ఇచ్చే విశేష ఫలం ఆ స్థాయిలోనే ఉంటుంది. చేసే బాహ్య క్రియలకన్నా విషయంపై మనసులో ఇష్టం ప్రధానం. అదే ముఖ్య భూమిక పోషిస్తుంది. అందుకే గురువు ఎప్పుడూ నీ సాధనలో పరిణామం చూడడు. నాణ్యతనే చూస్తాడు. గురుతత్త్వమైన దత్తాత్రేయుల వారికి స్మర్తుగామి అని పేరు. స్మరించినంతచేతనే ఫలం ఇస్తాడు అని అర్ధం. గురువు కూడా అంతే. వారిని స్మరించేవారికి మాత్రమే కాదు ధర్మాన్ని స్మరించినా ఫలం అందిస్తారు. దైవంపై, మంత్రంపై, సత్యంపై మనకున్న ఇష్టమే ఆయనకు సంతోషం !

కామెంట్‌లు లేవు: