21, జులై 2020, మంగళవారం

" పోతూ పేరంటము"

కరోనా నేపధ్యములో వున్న తీవ్ర పరిస్థితులలో ఆంధ్ర మహిళామండలి యావత్తు  తీవ్ర ధర్మ సంకటం ఎదుర్కొంటున్నది .  కోవిద్ నేపథ్యంలో  శ్రావణ మంగళవారం నోముల తరువాత వాయినాలు ఎవరికి ఇవ్వాలి? ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల  విద్వద్మండలి, ప్రవచనకర్తలు,  శాస్త్రకారులు భేటీ అయి ఎడతెరపి లేకుండా ఏకధాటిన,  అష్టాదశ పురాణాలు, నాలుగు వేదాలు, ఉపనిషద్ లు , శృతి స్మృతి, ధర్మార్ధ సంహిత, మహాభారత, భాగవత, రామాయణాలు మొదలైన హిందూ ధార్మిక వాంగ్మయాన్ని పూర్తిగా చర్చించి తర్జనభర్జనల తరువాత నిర్ణయం ప్రకటించారు.  ఈ విషయమై ప్రవచన చక్రవర్తి బిరుదాంకితుడైన శ్రీ వాగంటి వారు మాట్లాడుతూ పూర్వం జగన్మాత ఐన పార్వతీ దేవి హిమవంతుని పుత్రికగా జన్మించి మహాదేవుడైన శివుని పెండ్లాడిన తరువాత మొదటి సంవత్సరం నోములు నోచి వాయినములు ఇచ్చుకుందామని, 
శ్రీ మహాలక్ష్మి ,  మహా సరస్వతి , శచీదేవి ,స్వాహాదేవి , మొదలైన వారిని తాంబూలం మరియు పేరంటానికి పిలువగా 
వారందరూ తారకాసురునిచే సృష్టించబడ్డ
భయోత్పాతము చేత వారివారి తావులని వదలి రాలేక తమ అశక్తతను వ్యక్తంచేయగా ( అప్పటికి శ్రీ కార్తికేయ స్వామి జననం దేవ సైన్యాధ్యక్యత కాలేదు) ఉమా దేవి తన పతి శంకరుని క్షేమమునిగూర్చి తీవ్ర ఆందోళన చెందివుండగా సదా  ' తెలియగతరమా నీ లీలలు ' ( కొత్త  రఘురామయ్య గారు ) అని పాడుతూ సమయానికి ప్రత్యక్షమైయే నారదులవారు వచ్చి ఈ విషయమై ఎందుకు ఆందోళన తల్లి ! భోళాశంకరుడు అయిన నీ భర్తనే అడుగమనగా సదాశివునికి అకస్మాతుగా తపస్సు గుర్తుకి వచ్చి హిమాలయాలలోకి అంతర్ధానం కాగా లోకకల్యాణార్థం నారదులవారే పూనుకొని అమ్మా ,  యీ విషయమై చింత వలదు విపత్కర పరిస్టుతులలో పూజ అయిన తరువాత పతినే కరోనా నేపధ్యములో వున్న తీవ్ర పరిస్థితులలో ఆంధ్ర మహిళామండలి యావత్తు  తీవ్ర ధర్మ సంకటం ఎదుర్కొంటున్నది .  కోవిద్ నేపథ్యంలో  శ్రావణ మంగళవారం నోముల తరువాత వాయినాలు ఎవరికి ఇవ్వాలి? ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాల  విద్వద్మండలి, ప్రవచనకర్తలు,  శాస్త్రకారులు భేటీ అయి ఎడతెరపి లేకుండా ఏకధాటిన,  అష్టాదశ పురాణాలు, నాలుగు వేదాలు, ఉపనిషద్ లు , శృతి స్మృతి, ధర్మార్ధ సంహిత, మహాభారత, భాగవత, రామాయణాలు మొదలైన హిందూ ధార్మిక వాంగ్మయాన్ని పూర్తిగా చర్చించి తర్జనభర్జనల తరువాత నిర్ణయం ప్రకటించారు.  ఈ విషయమై ప్రవచన చక్రవర్తి బిరుదాంకితుడైన శ్రీ వాగంటి వారు మాట్లాడుతూ పూర్వం జగన్మాత ఐన పార్వతీ దేవి హిమవంతుని పుత్రికగా జన్మించి మహాదేవుడైన శివుని పెండ్లాడిన తరువాత మొదటి సంవత్సరం నోములు నోచి వాయినములు ఇచ్చుకుందామని, 
శ్రీ మహాలక్ష్మి ,  మహా సరస్వతి , శచీదేవి ,స్వాహాదేవి , మొదలైన వారిని తాంబూలం మరియు పేరంటానికి పిలువగా 
వారందరూ తారకాసురునిచే సృష్టించబడ్డ
భయోత్పాతము చేత వారివారి తావులని వదలి రాలేక తమ అశక్తతను వ్యక్తంచేయగా ( అప్పటికి శ్రీ కార్తికేయ స్వామి జననం దేవ సైన్యాధ్యక్యత కాలేదు) ఉమా దేవి తన పతి శంకరుని క్షేమమునిగూర్చి తీవ్ర ఆందోళన చెందివుండగా సదా  ' తెలియగతరమా నీ లీలలు ' ( కొత్త  రఘురామయ్య గారు ) అని పాడుతూ సమయానికి ప్రత్యక్షమైయే నారదులవారు వచ్చి ఈ విషయమై ఎందుకు ఆందోళన తల్లి ! భోళాశంకరుడు అయిన నీ భర్తనే అడుగమనగా సదాశివునికి అకస్మాతుగా తపస్సు గుర్తుకి వచ్చి హిమాలయాలలోకి అంతర్ధానం కాగా లోకకల్యాణార్థం నారదులవారే పూనుకొని అమ్మా ,  యీ విషయమై చింత వలదు విపత్కర పరిస్టుతులలో పూజ అయిన తరువాత పతినే " పోతూ పేరంటము" గా భావించి కూర్చుండబెటి, అర్గ్య పాద్యాదులిచ్చి తనచే బియ్యపుపిండితో చేయబడ్డ జ్యోతులను, శనగలు, అరటిపళ్ళు,  నానావిధ పరిమళపత్రములను  పతి దేవుని పాదాలకు నమస్కరించి సమర్పించి  అవిఅన్నీ అయన పూర్తిగా తినేవరకు ఉండి తలపై అక్షింతలు చల్లుకోవాలని , తానేకాక సాటి పతివ్రతల తాంబూలాలు,  జ్యోతులు, ఆకులూ,  అలములు అన్నీ తన పతిచే తినిపించిన సహస్రకోటి యజ్ఞములు చేసిన పుణ్యముతో నిండు నూఱేళు  ఐదోతనంతో  వర్ధిల్లుతారని , ఈ విషయములో సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించినా తప్పులేదని ఉపదేశము చేసారు. ఈ విషయము భయంకరాపురాణములో, దశమస్కదములో ఉందని,  ప్రస్తుత పరిస్థితులలో ఇంతకుమించి ఏమి చేయలేమని,  వేరే ఉపాయము లేదని
సాక్ష్యతు శివుడే ఆచరించాడు కాబట్టి అదే విధంగా చేయాలనీ శ్రీ వాగంటి వారు చెప్పారు. సాధారణముగా  శ్రీ వాగంటి వారు ఏమి చెప్పినా తీసిపడేసి, ఎకసెక్యం చేసే ప్రవచన సామ్రాట్ బిరుదాంకితుడైన శ్రీ చరికపాటి వారు కూడా ఈ విషయములో  ఏకిభవించారు. తఫఃసంపన్నుడూ, బ్రహ్మఋషి సమానుడుగా కొలువబడుతున కొలువబడుతున్న శ్రీ మర్ముఖ శర్మగారు యధావిధిగా మౌనం  అంగీకారమో అర్ధాంగీకారమో తెలియకుండా తలవూపుతూ చిరునవ్వుతో కూర్చున్నారు. 

లోపలవున్న కొందరు పెద్దలు, ఈ నిర్ణయం ముందుగానే  రహస్యముగా తమతమ శిషులకి తెలియపరచగా వారు రాత్రికిరాతే పలాయనం చిత్తగించడానికి ప్రయత్నించగా పతివ్రతా శిరోమణులైన వారి సతీమణులు కాళ్లు చేతులు కట్టిపడేసి,  నిన్న ధర్మసందేహాల కార్యక్రమములో వచ్చిన  శ్రీ తైలవరపు వారిని , అది తప్పా ఒప్పా అని అడిగితే అయన యధావిధిగా  రెండు చేతులు ఊపుతూ అర్ధం కాకుండా  రెండో మూడో శ్లోకాలు పాడి శివుడే చేయగా తుచ్చ జీవాలైన ఈ మగవారెంత అనిచెప్పారు.  దాంతో మరీ విఛలవిడిగా ముందు జాగ్రత్త చర్యగా కట్టి పడేస్తున్నారని తెలుస్తుంది. 

సదాశివుడు భోళాశంకరుడు గరళాన్ని మింగిన వాడు కాబట్టి బియ్యపుపిండితో చేసిన జ్యోతులను , అరటిపండ్లు, శనగలు,  ఆకులూ అలములు తినగలిగాడు కానీ సామాన్యమైన మగవారికి అది సాధ్యమా అని  తీవ్ర వ్యధకు గురిఅయిన కొందరు పురుషసింహలు ఇరురాష్ట్ర ముఖ్యమంత్రులని కలవడానికి ప్రయత్నించగా యధావిధిగా కెసిఆర్ గారు ఫామ్ హౌస్ లో వున్నారని జగన్ గారు తాను క్రిస్టియన్ అయినందున ఈ విషయాలు తనకు తెలియవని చెప్పి తప్పించుకున్నారు (అసలు విషయం మహిళామణుల ఓట్లు).   చివరకు తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై గారిని  సంప్రదించడానికి ప్రయత్నించగా వారి భర్త గారైన శ్రీ సౌందరరాజన్ గారు కూడా యిదే పరిస్థితిలో ఉండి తీవ్ర నిరాశ నిస్పృహలతో వున్నారని అభిజ్ఞవర్గాలద్వారా తెలిసి ఈ పురుషసింహలు కూడా కనపడకుండా పోయినారు.

మరొక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటి అంటే త్రిమూర్తులవంటి ముగ్గురు  ప్రవచనకారులు  ఒకరు కాశీలో, ఒకరు కురుకేత్రంలో, మరొకరు మానససరోవరం ప్రవచనాలు ఉన్నాయని చెప్పి ఆజ్ఞతంలోకి వెళ్లినట్లు భోగట్టా.

 ఒకవైపు కరోనా మరోవైపు  పోతూపేరంటములు ఎటు దిక్కు తోచక ,  మునుపెన్నడూ ఇట్లాంటి భయానక పరిస్థితి ఎరుగక, ఎటు పోవాలో తెలియక శివాలయాలలో, మఠాలలో, సత్రాలలో  తలదాచుకుందామని వెళుతున్న అమాయకులైన  రెండు రాష్ట్రాల
పురుషసింహలపై మహిళామణులచే 
దాడులు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఇది గర్హనీయం ఖండించతగినది. 
చివరకు  యేమీ చేసేదిలేక ,  మునుపు యిదే పరిస్థితిని ఎదుర్కొని విజయవంతుడై నిలిచిన సదాశివుడొక్కడే  తమని  కాపాడగలవాడని, శరణుకోరి భక్తిశ్రద్దలతో రహస్యముగా వేడుకొంటున్నారు.

సృష్టిలోనే మెళకువగలిగి బుద్ధిజీవులై ,  పురుషసింహలమైన మనమందరము ఈ విపత్కర పరిస్థితిని సంఘటితమై, ఒకవైపు కరోనని ఎదుర్కొంటూ, మరోవైపు
పోతు పేరంటాలుగా అలరించి  శ్రావణమాసం  తరువాత కలుద్దామని ఆశిస్తూ,  ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఇట్లు భవదీయుడు (పేరు ఎందుకులెండి స్వామి)గా భావించి కూర్చుండబెటి, అర్గ్య పాద్యాదులిచ్చి తనచే బియ్యపుపిండితో చేయబడ్డ జ్యోతులను, శనగలు, అరటిపళ్ళు,  నానావిధ పరిమళపత్రములను  పతి దేవుని పాదాలకు నమస్కరించి సమర్పించి  అవిఅన్నీ అయన పూర్తిగా తినేవరకు ఉండి తలపై అక్షింతలు చల్లుకోవాలని , తానేకాక సాటి పతివ్రతల తాంబూలాలు,  జ్యోతులు, ఆకులూ,  అలములు అన్నీ తన పతిచే తినిపించిన సహస్రకోటి యజ్ఞములు చేసిన పుణ్యముతో నిండు నూఱేళు  ఐదోతనంతో  వర్ధిల్లుతారని , ఈ విషయములో సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించినా తప్పులేదని ఉపదేశము చేసారు. ఈ విషయము భయంకరాపురాణములో, దశమస్కదములో ఉందని,  ప్రస్తుత పరిస్థితులలో ఇంతకుమించి ఏమి చేయలేమని,  వేరే ఉపాయము లేదని
సాక్ష్యతు శివుడే ఆచరించాడు కాబట్టి అదే విధంగా చేయాలనీ శ్రీ వాగంటి వారు చెప్పారు. సాధారణముగా  శ్రీ వాగంటి వారు ఏమి చెప్పినా తీసిపడేసి, ఎకసెక్యం చేసే ప్రవచన సామ్రాట్ బిరుదాంకితుడైన శ్రీ చరికపాటి వారు కూడా ఈ విషయములో  ఏకిభవించారు. తఫఃసంపన్నుడూ, బ్రహ్మఋషి సమానుడుగా కొలువబడుతున కొలువబడుతున్న శ్రీ మర్ముఖ శర్మగారు యధావిధిగా మౌనం  అంగీకారమో అర్ధాంగీకారమో తెలియకుండా తలవూపుతూ చిరునవ్వుతో కూర్చున్నారు. 

లోపలవున్న కొందరు పెద్దలు, ఈ నిర్ణయం ముందుగానే  రహస్యముగా తమతమ శిషులకి తెలియపరచగా వారు రాత్రికిరాతే పలాయనం చిత్తగించడానికి ప్రయత్నించగా పతివ్రతా శిరోమణులైన వారి సతీమణులు కాళ్లు చేతులు కట్టిపడేసి,  నిన్న ధర్మసందేహాల కార్యక్రమములో వచ్చిన  శ్రీ తైలవరపు వారిని , అది తప్పా ఒప్పా అని అడిగితే అయన యధావిధిగా  రెండు చేతులు ఊపుతూ అర్ధం కాకుండా  రెండో మూడో శ్లోకాలు పాడి శివుడే చేయగా తుచ్చ జీవాలైన ఈ మగవారెంత అనిచెప్పారు.  దాంతో మరీ విఛలవిడిగా ముందు జాగ్రత్త చర్యగా కట్టి పడేస్తున్నారని తెలుస్తుంది. 

సదాశివుడు భోళాశంకరుడు గరళాన్ని మింగిన వాడు కాబట్టి బియ్యపుపిండితో చేసిన జ్యోతులను , అరటిపండ్లు, శనగలు,  ఆకులూ అలములు తినగలిగాడు కానీ సామాన్యమైన మగవారికి అది సాధ్యమా అని  తీవ్ర వ్యధకు గురిఅయిన కొందరు పురుషసింహలు ఇరురాష్ట్ర ముఖ్యమంత్రులని కలవడానికి ప్రయత్నించగా యధావిధిగా కెసిఆర్ గారు ఫామ్ హౌస్ లో వున్నారని జగన్ గారు తాను క్రిస్టియన్ అయినందున ఈ విషయాలు తనకు తెలియవని చెప్పి తప్పించుకున్నారు (అసలు విషయం మహిళామణుల ఓట్లు).   చివరకు తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై గారిని  సంప్రదించడానికి ప్రయత్నించగా వారి భర్త గారైన శ్రీ సౌందరరాజన్ గారు కూడా యిదే పరిస్థితిలో ఉండి తీవ్ర నిరాశ నిస్పృహలతో వున్నారని అభిజ్ఞవర్గాలద్వారా తెలిసి ఈ పురుషసింహలు కూడా కనపడకుండా పోయినారు.

మరొక దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటి అంటే త్రిమూర్తులవంటి ముగ్గురు  ప్రవచనకారులు  ఒకరు కాశీలో, ఒకరు కురుకేత్రంలో, మరొకరు మానససరోవరం ప్రవచనాలు ఉన్నాయని చెప్పి ఆజ్ఞతంలోకి వెళ్లినట్లు భోగట్టా.

 ఒకవైపు కరోనా మరోవైపు  పోతూపేరంటములు ఎటు దిక్కు తోచక ,  మునుపెన్నడూ ఇట్లాంటి భయానక పరిస్థితి ఎరుగక, ఎటు పోవాలో తెలియక శివాలయాలలో, మఠాలలో, సత్రాలలో  తలదాచుకుందామని వెళుతున్న అమాయకులైన  రెండు రాష్ట్రాల
పురుషసింహలపై మహిళామణులచే 
దాడులు జరుగుతున్నాయని తెలుస్తున్నది. ఇది గర్హనీయం ఖండించతగినది. 
చివరకు  యేమీ చేసేదిలేక ,  మునుపు యిదే పరిస్థితిని ఎదుర్కొని విజయవంతుడై నిలిచిన సదాశివుడొక్కడే  తమని  కాపాడగలవాడని, శరణుకోరి భక్తిశ్రద్దలతో రహస్యముగా వేడుకొంటున్నారు.

సృష్టిలోనే మెళకువగలిగి బుద్ధిజీవులై ,  పురుషసింహలమైన మనమందరము ఈ విపత్కర పరిస్థితిని సంఘటితమై, ఒకవైపు కరోనని ఎదుర్కొంటూ, మరోవైపు
పోతు పేరంటాలుగా అలరించి  శ్రావణమాసం  తరువాత కలుద్దామని ఆశిస్తూ,  ఇంతే సంగతులు చిత్తగించవలెను. ఇట్లు భవదీయుడు (పేరు ఎందుకులెండి స్వామి)

కామెంట్‌లు లేవు: