23, జులై 2020, గురువారం

గత తప్పిదాలు


చైనాతో లద్ధక్ నుండి అరుణాచల్ వరకు మనకున్న బార్డర్ 4,036 km అయితే, ఒక ముద్దలా భారత్ మధ్యలో బంగ్లాదేశ్ తో మాత్రం 4,136 km.

ఎవరైనా దేశ హితం కోరుకునే నాయకుడైతే దూరదృష్టితో ఆలోచిస్తారు. ప్రజాహితమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆలోచన లేమి, ఉదాసీనత వల్ల అప్పటి కాంగ్రెస్ నాయకులు నెహ్రు, ఇందిరా లాంటివారి వల్ల ఎన్ని దుష్ఫలితాలో చూడండి..

⛔ ఒకదిక్కు పాక్ ఇంకో దిక్కు చైనాతో తీవ్ర వివాదాలు. బంగ్లా తో అంత లేనట్టు కనిపోయిస్తున్నప్పటికీ దేశ భద్రతకు తీవ్ర భంగం బంగ్లాదేశ్ తో ఈ సుదీర్ఘ సరిహద్దు..

⛔ఈశాన్య రాష్ట్రాలతో భారత్ కు ఉన్న లింక్ ను చికెన్ నెక్ ప్రాంతం అంటాము. 7 రాష్ట్రాలను మిగితా భారత్ తో కలిపే లింక్ వెడల్పు కేవలం 10-20 KM మాత్రమే..

⛔ బెంగాల్ నుండి మిజోరాం, త్రిపుర వెళ్లాలంటే 2 రోజుల ప్రయాణం. బంగ్లాదేశ్ చుట్టూ తిరిగి వెళ్ళాలి..

⛔ పైనున్న మేఘాలయ అస్సాం లాంటి రాష్ట్రాలకు వెళ్లాలన్న 15-20 గంటల సమయం. బంగ్లా తల భాగం అంత తిరిగి, ఇరుకు ప్రాంతం గుండా వెళ్ళాలి..

⛔ ఈ చికెన్ నెక్ ప్రాంతానికి చుట్టూ నాలుగు దేశాలు. అవును, 12 కీమీ దూరంలో బంగ్లా, 25 కీమీ దూరంలో నేపాల్, 40కీమీ దూరంలో భూటాన్, 75కీమీ దూరంలో చైనా. చుట్టూ ఇన్ని ఉండగా ఆ 10కీమీ మాత్రమే ఉన్న ప్రాంతమే ఈశాన్య రాష్ట్రాలకు,మిగితా భారత దేశానికి లింక్.

⛔ అందుకే రక్షణ పరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. ఆ లింక్ కట్ అవుతే ఈశాన్య రాష్ట్రాలకు, మిగితా భారత్ బంధం తెగిపోతుంది. చైనా పన్నాగం ఇదే..

⛔ అలాంటి పరిస్థితుల్లో, మనగా భూభాగం బంగ్లాకి ఇచ్చేటప్పుడు, అది కూడా రెండు సార్లు అవకాశం వచ్చిన్నప్పుడు ఎంత తెలివిగా వ్యవహరించాలి?  కనీసం రంగపూర్ ప్రాంతం, అంటే కింద మ్యాప్ లో వంకాయ కలర్ ప్రాంతం అయిన దక్కించుకోవలింది. కానీ కాంగ్రెస్ నాయకులు ఇవన్నీ పట్టించుకోలేదు.

⛔ అక్కడే కాదు, కింద చిత్తగాంగ్ వద్ద కూడా అస్తవ్యస్త విభజన. దేనికి బేరమాడలేదు. ఫలితం చిన్న ప్రాంతానికి 4,136 కిమి సుదీర్ఘ బార్డర్..

⛔ రక్షణ పరంగా చిక్కులు. ఎంత సైనిక మోహరింపు, ఎంత ఖర్చు, ఎన్ని ఓని గంటలు వృథా? 10,20 - 100కిమి వెళ్లే ప్రాంతానికి వేల కిలోమీటర్లు తిరగాలి.. 

⛔ రైళ్లు, రోడ్లు అన్ని కూడా దూర ప్రయాసాలతో ముడిపడి ఉంది. వేల కోట్ల ప్రజాధనం, లక్షల కోట్లు సంపద కొన్ని తెలివి తక్కువ నిర్ణయాల వల్ల దేశం ఇప్పటికీ పోగొట్టుకోనుంది..

⛔ ఈ సుదీర్ఘ బార్డర్ వల్లనే రోహింగ్యాలు, ఉగ్రమూకలు కూడా రక్షణ కళ్ళు కప్పి భారత్ కి రాగలుగుతున్నారు. కోట్ల అక్రమ రవాణా..

⛔ కొన్ని తుగ్లక్ నిర్ణయాలు, కొన్ని సందర్భాల్లో మౌనం, ఓట్ల కోసం ఒక మతాన్ని బుజ్జగించే రాజకీయాలు దేశానికి ఎంత నష్టమే చెప్పడానికి ఇదొక ఉదాహరణ..

కామెంట్‌లు లేవు: