7, సెప్టెంబర్ 2020, సోమవారం

రామాయణమ్.54


...
రాముడి వన గమనమునకు కౌసల్య అనుమతించటంలేదు. తల్లిని సమాధాన పరుచట ఇప్పుడు ఆయన కర్తవ్యము! .
.
అమ్మా ! నీవు,నేను,లక్ష్మణుడు,సుమిత్రామాత అందరమూ తండ్రిగారి ఆజ్ఞకు బద్ధులము కావలసినదే ! అది సనాతన ధర్మము!
( తండ్రి కుటుంబపు పెద్ద ,He is Superior to all in the family,
కుటుంబ వ్యవస్థ క్షీణదశకు చేరుకున్న నేటి రోజులలో దాని ప్రాముఖ్యత ప్రస్తుతము అర్ధము కాదు అని నా భావన).
.
నాయనా! నీ తండ్రి వలే నేను కూడా నీకు గురు స్థానములో ఉన్నాను కావున నీకు అనుజ్ఞ ఇవ్వను అని పలుకుతున్న తల్లిని, ఆవిడకు అండగా నిలచిన లక్ష్మణుని చూసి.....

రాముడు ,....కొరివిమంటలు పట్టుకొన్న మనుష్యులచే అడవిలో చుట్టుముట్టబడ్డ గొప్ప ఏనుగు లాగ అయిపోయాడు.
.
ఇంతగా వారిస్తున్నా ,ఆయన బుద్ది మాత్రము ఒకదానియందే స్థిరముగా ఉన్నది అదియే "ధర్మము".
.
(ధర్మమార్గమునుండి రవ్వంతయినా ప్రక్కకు జరుగడు .నిశ్చయాత్మకమైన ,నిర్ణయాత్మకమైన బుద్ధి ధర్మమునందేగలవాడు ఒక్కడే !..అతడే "రాముడు".)
.
తన బుద్ధి మారకుండా దృఢముగా నిలుచుని ,స్థిరగంభీర కంఠముతో ,లక్ష్మణా ఎందుకు నీవు అమ్మతో చేరి నన్ను బాధిస్తావు? .కష్టపెడతావు?
.
అర్ధము,కామము నాకు ముఖ్యము కావు !
వాటికొరకు నాలో వెంపర్లాట లేదు !
ధర్మము పాటించడమే నాకు చాలా ఇష్టము ,
ధర్మపథము నాకిష్టమైన మార్గము.
.
తండ్రి మనకు పూజ్యుడు,
 ఆయన వృద్ధుడు కావచ్చుగాక,
కామప్రేరితుడు గావచ్చుగాక,
ఆయన కోపముగానైనా,సంతోషముగానైనా ఆజ్ఞాపించినప్పుడు ధర్మదృష్టి కలవాడెవడైనా చేయకుండా ఉంటాడా!.
.
కేవలము రాజ్యము ,భోగములకొరకు గొప్పగొప్ప ఫలితాలిచ్చే ధర్మమార్గము నేను వదలను గాక వదలను...
.
యశోహ్యహం కేవలరాజ్య కారణాత్
న పృష్ఠతః కర్తుమలం మహోదయమ్!
.
ఈ జీవితము అల్పకాలికమైనది దీనికోసం తుచ్ఛమైన రాజ్యము ధర్మవిరుద్ధముగా సంపాదించను.
.
  శ్రీ రామసింహం ధర్మగర్జన చేసింది
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: