7, సెప్టెంబర్ 2020, సోమవారం

అశ్వత్ధవ్రుక్చం

🍀🍀🍀🍀🍀🍀🍀🍀అశ్వత్ధవ్రుక్చం యొక్క ప్రాశస్త్యం గురించి :'అశ్వత్ధవ్రుక్చం లో సర్వ దేవతలు ఉంటారు. దాని మహాత్మ్యము గురించి బ్రహ్మాండ పురాణం లో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్ధమే నారాయణ స్వరూపం. ఆ వ్రుక్చం యొక్క మూలమే బ్రహ్మ. దాని మధ్య భాగమే విష్ణువు. దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులు ను పూజించినట్లే. అలానే, త్రిమూర్తులూ దానియొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులు లోని కొమ్మలు. తూర్పు దిక్కుకున్న కొమ్మల లో ఇంద్రాది దేవతలు ఉంటారు. దాని వ్రేళ్ళలో మహర్షులు, గోబ్రాహ్మణులు, నాలుగు వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో 'అ' కారము, మానులో 'ఉ' కారము, దాని పండ్లు 'మ' కారము. ఆ వ్రుక్చం అంతా కలిపి ప్రణవ స్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించ గలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఈ వ్రుక్చం ను సేవించవలసిన విధానం నారదమహర్షి ఇలా చెప్పాడు. "అశ్వత్ధ ప్రదక్షిణం చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలోనూ, గురు, శుక్ర మౌడ్యాలలోనూ, క్రుష్ణ పక్షంలోనూ ప్రారంభించకూడదు. శుభ సుముహూర్తం లో స్నానాదులు చేసుకొని శుచియై ఉపవశించి మరీ ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్ర వారాల్లో నూ, సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాలలోనూ, రాత్రి భోజనం అయ్యాక ఈ వ్రుక్చం ను సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్తుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచి పెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి, ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగ యమున లను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్ధ వ్రుక్చం నకు భక్తి తో ఏడుసార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరల స్నానం చేసి, దేవతా మయమైన ఆ వ్రుక్చం నకు పురుష సూక్తవిధానంగా షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు కలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్ర నామ చదువుతూ గానీ, మౌనంగా గానీ, ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణ మొదట, చివరా నమస్కారము చేయాలి. ఇలా రెండు లక్షలు ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి, నాలుగు పురుషార్ధాలు సిద్ధిస్తాయి. త్రికరణశుద్ధిగా దానిపై దృష్టి ని నిలిపి, బిడ్డలు కలగాలన్నా, పెళ్లి కావాలన్నా సంకల్పం తో ప్రదక్షిణ చేస్తే తప్పక అనుకున్న పనులు జరుగుతాయి. శనివారం నాడు ఈ చెట్టు ను త్రాకి మ్రుత్యుంజయ మంత్రము జపిస్తే మ్రుత్యుభయం తొలగుతుంది. అశ్వత్ధాన్ని పూజించాక.
శనీశ్వరుని మంత్రమును జపించితే శని దోషం కూడా తొలగి, అభీష్ట సిద్ధి కలుగుతుంది.
             గురువారం, అమావాస్య కలిసిన రోజు న రావిచెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేద విప్రునికి మ్రుష్టాన్నం పెడితే కోటిమంది బ్రాహ్మణులు కు సమారాధన చేసిన ఫలితముంటుంది. అక్కడ చేసిన గాయత్రీ జపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది. రావిచెట్టును స్థాపించి తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెలిపిన ప్రదక్షిణలు చేశాక, ఆ సంఖ్య లో పదవ వంతు హోమం, అందులో పదవవంతు బ్రాహ్మణ సమారాధనమూ చేయాలి. ఈ వ్రతకాలములో బ్రహ్మ చర్యం అవలంభించాలి. ఉద్యాపన తర్వాత బంగారు రావిచెట్టు ను, అలంకరించిన ఆవుదూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల రాశిని, ఉదారమైన దక్షిణ లతో సౌశీల్య వంతులు, కుటుంబీకులు అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀

కామెంట్‌లు లేవు: