21, నవంబర్ 2020, శనివారం

ధార్మికగీత - 87*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 87*

                                   *****

       *శ్లో:- అజరా౽మరవత్ ప్రాజ్ఞ: ౹*

              *విద్యా మర్థం చ సాధ యేత్ ౹*

              *గృహీత ఇవ కేశేషు ౹*

              *మృత్యునా ధర్మ మాచరేత్ ౹౹*

                                   *****

*భా:- "జర" అంటే ముసలితనం. "అజర" - అంటే ముదిమి లేకపోవడం ; "అమర" - చావులేక పోవడం; లోకంలో వివేకవంతులు తమకు ముసలితనం లేదనే నిర్ణయానికి వచ్చి, విద్యను ఆర్జించాలి. "గుణాః పూజాస్థానం గుణిషు న చ లింగం న చ వయః" అని ఆర్యోక్తి. వయో నిమిత్తము లేని చక్కని విద్య వల్లనే మనలోని సుగుణాలు ప్రవర్ధ మానమై పరిమళిస్తాయి. ఫలాలనిస్తాయి. జీవితాన్ని సార్థకం చేస్తాయి. నేడు దూరవిద్య ద్వారా పెద్దలు చదువుకోవడం కద్దు. అలానే బుద్ధిమంతులు చావులేదనే నమ్మకంతో జవసత్త్వాలను కూడగట్టుకొని, ధనార్జన చేయాలి. గడిచింది చాలు అని ఆగిపోరాదు. అలాగే ప్రతిక్షణం మృత్యుదేవత తన జుట్టు పట్టుకుని ఈడ్చుకొని పోతున్నట్లు భావిస్తూ, ధర్మాన్ని నిర్వర్తించాలి. దానధర్మాలను నిత్యము, నిరంతరము చేస్తూనే ఉండాలని సారాంశము. కాన వయస్సుతో పనిలేకుండా చదువు, చావు లేదనే భావనతో డబ్బును గడిస్తూనే, అడుగడుగునా ధర్మనిరతుడవై, జీవన సమరం కొనసాగించాలని భావము*.

                                    *****

                     *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: