27, నవంబర్ 2020, శుక్రవారం

శివ నిర్వాణ షట్క స్తోత్రం**

 **ఓం నమః శివాయ**

**జగద్గురు ఆదిశంకర శంకరాచార్య కృత శివ నిర్వాణ షట్క స్తోత్రం** 

**నిర్వాణ షట్కం లేదా ఆత్మషట్కం**

వేదాంతపరంగా చాలా గొప్ప భావన ఇది! సర్వ జీవులలోనూ భాసించు 'ఆత్మతత్త్వం', 'శివతత్త్వం' అందరిలోనూ ఒకే విధంగా ఉంటుంది! 'శివం' అనగా నిరాకారం, నిర్వికారం, నిరంజనం, నిర్గుణం, కేవలం, శుద్ధం, పూర్ణం, ఆనందం, తురీయం, తురీయాతీతం, ఆత్మనిష్ఠ, ఆత్మ నిత్యసత్యావస్థ, అనంత శుద్ధ చైతన్య జ్యోతిస్వరూపం. 'నిర్వాణం' అంటే సూక్ష్మంగా చెప్పాలంటే 'మోక్షం'! ఆరు శ్లోకాలలో 'ఆత్మ స్వరూపాన్ని' గురించి అద్భుతంగా బోధచేసారు ఆదిశంకరులు.

ఈ శ్లోకాలు 'ఆత్మతత్వాన్ని' గురించి చక్కగా తెలియచేశాయి కనుక, ఈ ఆరు శ్లోకాలని 'ఆత్మషట్కం' అని కూడా కొందరు అంటారు. 'షట్కం' అంటే ఆరు! ప్రపంచ సాహిత్యం మొత్తం మీద ఇలా 'వేదాంత సారాన్ని' ఇంత సరళంగా, క్లుప్తంగా చెప్పిన జ్ఞాని మరెవ్వరూ ఉండకపోవచ్చు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు! 

సర్వజీవులలోనూ వెలుగొందు 'ఆత్మస్వరూపం, శివస్వరూపం' ఒక్కటే. సర్వేశ్వరుని సృష్టిలో సర్వజీవరాశులూ సమానమే. కావున అందరూ జాతి, వర్ణ, కుల, మత బేధాలు లేకుండా పరమేశ్వరుని ఏ రీతిలోనైనా ఆరాధించవచ్చును, 'శివయోగదీక్ష' గైకొని 'శివస్తోత్ర పఠనం' చేయవచ్చును. 'శివతత్వమును' హృదయమున నిలుపుకొనవచ్చును. వేదాంత సారమంతా ఈ ఆరు శ్లోకాలలో నిక్షిప్తం చేసిన ఆది శంకరులకు నమస్సులు 🙏🙏🙏.

#శ్రీజగద్గురు #ఆదిశంకరాచార్యకృత #తాత్పర్యసహిత #నిర్వాణషట్కము...

'జగద్గురువు శ్రీ ఆది శంకరభగవత్పాదాచార్యుల వారు' ఒకసారి హిమాలయ ప్రాంతంలో సరియైన గురువు కోసం అన్వేషిస్తుండగా ఒక సన్యాసి ఎదురొచ్చి, "నువ్వు ఎవరివి?" అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శ్రీ ఆది శంకరులవారు మొత్తం 'అద్వైత వేదాంతాన్ని, ఆత్మస్థితి' ని ఆరు శ్లోకాల రూపంలో "నిర్వాణ షట్కము" గా పలికారట. ఇది తను (అహం) అనుకునే ఆత్మ వివరణ కనుక దీనినే "#ఆత్మషట్కము" అని కూడా అంటారు.  'నిర్వాణం' అంటే సంపూర్ణ సమదృష్టి, ప్రశాంతత, స్వేచ్చ, ఆనందము (సత్+చిత్+ఆనందం = సచ్చిదానందం) మిళితమైన ఒక 'శుధ్ధచేతన స్థితి'. అదే 'సచ్చిదానందం'. సమస్త అద్వైత సిద్ధాంత సారం 'నిర్వాణషట్కం' (ఆత్మషట్కం) 

1. **మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్**

    **న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే**

    **న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః**

    **చిదానంద రూపః శివోహమ్ శివోహమ్**

భావం:  మనసు, బుద్ధి, నేను నాది అనే తపన అంటే అహంకారము, చిత్తము,ఇవి నేను కాను. కర్ణము,జిహ్వ,ఘ్రాణము ఇవియును నేను కాను. పృథివ్యాపస్తేజోవాయురాకాశములు నేను కాను.అంటే పంచ భూతాత్మకమైన పంచకర్మేంద్రియములకు పంచజ్ఞానేంద్రియములకు విధేయుడను కాను. చిదానందరూపుడైన శివుడను నేను. నేనే శివుడను. 

సచ్చిదానందానికి సులభమైన నిర్వచనము

'సత్ అంటే సత్యము – చిత్ అనిన జ్ఞానము -పర సుఖమే ఆనందము'.

2. **న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః**

    **న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః**

    **న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు**

    **చిదానంద రూపః శివోహమ్ శివోహమ్**

పంచవాయువులు:

ప్రాణ : శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువు

అపాన : ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములు పంపే వాయువు

వ్యాన: శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణం

ఉదాన: వాక్కు రూపంలో ఉండేవాయువు

సమాన: జీర్ణమవటానికి ఉపయోగించే వాయువు

ఉప ప్రాణాలు

నాగ : త్రేన్పు గా వచ్చే గాలి

కూర్మ : రెప్పవేయటానికి కారణమైన గాలి

కృకల : తుమ్ము

ధనంజయ :హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉండే వాయువు.

దేవదత్తం : ఆవులింత లోని గాలి

భావం:  ఈ ఐదు వాయువులు, ఐదు ఉపవాయువులు మన శరీరమును నిర్దేశించుతాయని శాస్త్ర వాక్యము.ప్రాణ వాయువు (శ్వాస) లేనప్పుడు చనిపోయినట్లు గుర్తిస్తారు. ధనంజయ వాయువు చనిపోయిన తర్వాత కూడా ఉండి శరీరం ఉబ్బటానికి కారణం అవుతుంది అని శాస్త్రము చెబుతుంది.

సప్త ధాతువులు: రక్తమాంసమేధోస్థిమజ్జారసశక్రములు (చర్మము, రక్తము, మాంసము, అస్తి, కొవ్వు, మజ్జ, శక్రం). ఇందులో చర్మము రక్తము మాంసము ఎముకలు క్రొవ్వు అందరికీ తెలిసినవే. మజ్జ అంటే ఎముక లోపలవుండే గుజ్జు, దీనినే bone marrow అని ఆంగ్లములో అంటారు. 'తస్స' అంటే ఈ 'మజ్జ'యే.

పంచ కర్మేంద్రియములు : వాక్పాణిపాదోపస్థపాయువులు. అంటే మాట-వాక్కు, చేయి-చేత,పాదములు-కాళ్ళు,ఉపస్థ-జననేంద్రియము,పాయువు-గుదము, ఉపస్థాపాయువులు అంటే పురీష శౌచ ద్వారములు.

నేను, పైన తెలిపినవేవీ కాను. చిదానందరూపుడైన శివుడను నేను. నేనే శివుడను.

3. **న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ**

    **మదో నైవ మే నైవ మాత్సర్య భావః**

    **న ధర్మో న చార్థో న కామో న మోక్షః**

    **చిదానంద రూపః శివోహమ్ శివోహమ్**

భావం: నాకు రాగ ద్వేషములు లేవు. లోభామోహములు లేవు. మదమాత్సర్యములు లేవు. ధర్మార్థకామ మోక్షాలు లేవు. చిదానందరూపుడైన శివుడను నేను. నేనే శివుడను.

4. **న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్**

    **న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞః**

    **అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త**

    **చిదానంద రూపః శివోహమ్ శివోహమ్**

భావం: నాకు పుణ్య పాపములులేవు. సుఖ దుఖ్ఖములు లేవు. మంత్ర తీర్థ దాన యజ్ఞాలులేవు. నేను భోజన క్రియనుగానీ , భోజనమునుగానీ, భుజించేవాడినిగానీ కాదు. చిదానందరూపుడైన శివుడను నేను. నేనే శివుడను.

5. **న మే మృత్యు శంకా న మే జాతి భేదః**

    **పితా నైవ మే నైవ మాతా న జన్మః**

    **న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః**

    **చిదానంద రూపః శివోహమ్ శివోహమ్**

భావం: నాకు మృత్యువు, భయము లేక సందిగ్ధత, జాతిరీతులు, తల్లిదండ్రులు, అసలు జన్మమే లేదు. బంధువులు మిత్రులు, గురువు, శిష్యులు ఏమీ లేవు. చిదానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

మరి నేనెవరు ???? 

6. **అహం నిర్వికల్పో నిరాకార రూపో**

    **విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం**

    **న చాసంగత నైవ ముక్తిర్ న మేయః**

     **చిదానంద రూపః శివోహమ్ శివోహమ్**  

వికల్పము : మతి భ్రమ, ఉల్లంఘనం జ్ఞాపకశక్తి, ఆలోచన తగ్గిపోవు లక్షణము కలిగిన మానసిక స్థితి అస్తవ్యస్తం, తారుమారు.

భావం: నేను వికల్పములకు అతీతుడను. ఎటువంటి వికల్పములూ నన్నంటవు. నేను సర్వవ్యాపిని. కావున నిరాకారుడను. నిరాకారుడనుకావున నేను నిరంజనుడను (దోషము లేని వాడిని). నాకు ఏవిధమైన ఇంద్రియ సంబంధము లేదు. నాకసలు బంధమూ లేదు మోక్షము లేదు. చిదానందరూపుడైన శివుడను నేను. నేనే శివుడను.

"ఆత్మ" ను గూర్చి ఇంత వివరంగా విశదంగా విపులంగా అబుద్ధికి గూడా బోధపడు విధముగా చెప్పిన 'ఆది శంకరులకు' అంజలి ఘటించుట తప్ప అన్యము చేయ నశక్తులము.

**ఓం నమః శివాయ**

**జగద్గురు ఆది శంకరాచార్య కృత శివ నిర్వాణ షట్క స్తోత్రం** 

**శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం**

🙏🙏🙏

సే కరణ

**శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: