1, నవంబర్ 2020, ఆదివారం

నీటి చందమామ

 🌕 *నీటి చందమామ* 😁

•••••••••••••••••••••••••••••••••••••

తాగడానికి వెనక ముందు

పెదాల తడబాటు

భూమి పై నీరు కలుషితమైంది

శీలం కోల్పోయింది

ప్లాస్టిక్ సీసాలో భూతమైంది

జీవనదులకూ హృద్రోగం

పదండి ! గంగాలాలు బిందెలు

తల పై పెట్టుకొండి

చందమామ నీటిని నింపుకుందాం

సుజలాం సుజలాం

మన వెన్నెల చందమామ ---

మనకోసం నీటిచందమామ

చెలిమల చందమామ 

చల్లని మనసౌతుంది అందరిది

ప్రపంచ యుద్ధాలు ఉండవు - ఉఫ్

అంతటా శాంతిపావురాలు

అందరం దేవతలమౌతాం

భూమి స్వర్గమౌతుంది

చంద్రుడి నీరు తాగితే చంద్రబలం

పంచాంగం సార్థకం !

దివి చంద్రుడు దిగిరాకున్నా

చందమామ 

అమృత జలం అమృత జలం

అందరికీ పంపకం !

ఇక మనది మహర్దశ 

     - కందాలై రాఘవాచార్య

కామెంట్‌లు లేవు: