1, నవంబర్ 2020, ఆదివారం

చేతులు ఎత్తుట

 "చేతులు ఎత్తుట నుండే "shake hand అన్నది వివిధ రూపాలలో రూపాంతరం చెంది వచ్చినది, ప్రస్తుతము ప్రపంచ దేశాలు, దీనిని వాడుతున్నారు. భారత దేశము నందు: "నమస్కారము" పెడతారు.   టిబెట్టు నందు " ఇరువురు నాలిక బయటపెడతారు.   పోలిష్ నేవియాలో :- ఇరువురు ముక్కులతో రుద్దుకుంటారు. 1) Stiff shake hand :2) loose  shakehand  3)Glow Shake hand 4) finger Hands  మొదలగు రకములు ముఖ్యముగా వాడుకలో ఉన్నవి. రాజకీయ నాయకులు భుజం మీద చేతులు కూడా వేసి తట్టు తారు.  డాక్టరూ బంగారు పనిచేయువారు చేతివేళ్ళతో చేయు నైపుణ్యము గల వారు, వేళ్ళ తో అంటీ అంటనట్టు గా షేక్ హ్యాండ్ ఇస్తారు,ఎంత మాత్రమున వారికి ఇష్టం లేనట్టు కాదు అది వృత్తి నైపుణ్యం గల వారు మాత్రమే అలా చేస్తారని గ్రహించాలి.  మరికొందరు చేపను పట్టుకున్నట్టు షేక్హ్యాండ్ ఇచ్చేవారిని చూస్తాము.  Cooperative shake hands:- కళ్ళల్లో కళ్ళు పెట్టి నమస్కారము పెట్టుట, Police department, Military department  వారు  saavdhan లో ఉండి,  వ్యక్తిని దూరంలో పెట్టుట, వారి అలవాటు, వారు చేసే ప్రతి పనిలోనూ బాడీ లాంగ్వేజి స్పష్టముగా కనిపించును.  రోడ్డు మార్చ్ లో ఒక విధముగా, లాఠీ డ్రిల్ లో ఒక విధముగా, ARMS తో ఉండగా ఒక విధముగా ఉండును.   Zones (పరిది ) ఇది కూడా నాలుగు విధములు, 1) Intimate zone :- "ముఖ్యంగా భార్యాభర్తలు ప్రేమికులు ఈ కేటగిరి కి వస్తారు. పిల్లలను కూడా ఒక వయసులో మాత్రమే రానిస్తారు 46 సెంటి మీటర్ల దూరం పాటిస్తారు, ఇతరులను కూడా పబ్లిక్లో అనుమతి ఇవ్వరు, పబ్లిక్ లో అపోహలకు తావు ఇవ్వరు.    2) Personal Zone :- ఈ జోన్ పరిధిలో 46 సెంటి మీటర్ల నుండి 1.2 మీటర్లు కుటుంబ సభ్యులు స్నేహితులు బాగా కావలసిన వారు మాత్రమే ఉంటారు.  ఇతరులను వీరు రానివ్వరు, పోస్ట్, కొరియర్, అడుక్కునేవాడు రూము లోనికి రానివ్వరు కదా!      3) Social zone : C.E.O meeting, ముఖ్యమంత్రి సమావేశములు, కొన్ని చోట్లకు మీడియా ని కూడా అనుమతి ఇవ్వాలని కూడా లేదు. ఇన్విటేషన్ లేనిదే ఎవరిని అనుమతించరు, భద్రతా కారణాలు కూడా కొన్ని చూపుతారు, కావాలని అనిపిస్తే!       4) Public zone :- " ముందు వచ్చినవాడు బస్సులో కిటికీ పక్కకు చేరును.  మీటింగ్ కి వెళ్ళిన వాడు, సర్కస్ కు వెళ్ళిన వాడు, సినిమాకు వెళ్ళిన వాడు , వారు 65 గా పరిధిని చూసుకుని అనుకూలముగా కూర్చుంటారు. వేరే వారిని రానివ్వరు.  మరియు వీధి కుక్కల నే తీసుకోండి, వేరే కుక్క వాటి పరిధిలోకి వచ్చిన మరుగుతూ వెంటపడి పరిగెత్తు తుంది, తన పరిధి దాటి పోదు నిలబడి తిరిగి వెనుకకు తిరిగి వస్తుంది.  ఆవులు, గేదెలు , మేతకు వెళ్లి తిరిగి వాటి గమ్యస్థానం మనకు వచ్చును. ఇలా చాలా ఉదాహరణలు ప్రస్తావించ వచ్చు కూడా!  "ఇంటర్వ్యూ కి వెళ్లిన వ్యక్తి తన బాడీ లాంగ్వేజ్ గురించి, శ్రద్ధ తీసుకొని యెడల, విజయం సాధించలేడు, కారణం ఏంటి? అతనికి ట్రస్ట్ లెవెల్స్ ఎక్కువగా ఉండును, చేతులు జేబులో పెట్టుకుని, తల యొక్క భాగములను ముట్టుకుని, కుర్చీలో సీటు చివరి భాగాన కూర్చుని, ఉన్న వారిని వారు సెలెక్ట్ చెయ్యరు, సీటు వెనుకకు ఆనుకుని  "బ్యాక్ రెస్ట్" పొజిషన్లో కూర్చుని చేతులు ముందుకు తొడ మీద పెట్టుకుని, చిరునవ్వుతో నడుము నిటారుగా కూర్చున్నా! అనుమతి తీసుకొని కూర్చోవాలి, చేతులు కట్టుకుని నిలబడిన వారికి జ్ఞాపకశక్తి తక్కువగా అంచనా వేయగలరు.  సుమా! తదుపరి కృతజ్ఞతలు తెలియపరచాలి వారికి, విజయము చేకూరుతుంది.  ఇప్పటి రోజులు ఎదుటివారిని నమ్మే రోజులు కావు.  ఆడవారు కూడా తమ భర్తలను  సెలెక్ట్ చేసుకునేటప్పుడు, వారి మనోభావాలు, నడక, బాడీ లాంగ్వేజ్ ఇన్ కూడా పరిగణ లోనికి తీసుకునే రోజులు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా జీవితాంతము బాధపడాలి, అనేది వారి తర్కము,  నేడు ఈ" బాడీ లాంగ్వేజ్" వ్యాపారము, విద్య, ఉద్యోగము, ఫ్యామిలీ లైఫ్ లో కూడా అత్యంత ఉపయోగకరముగా కొనసాగుతున్నది.  కనుక ప్రతి ఒక్కరూ! ఈ కళను గౌరవించి , ఆచరణలో పెట్టాలి. "మజుందార్, బెంగళూరు"  జై హింద్, జై భారత్,

కామెంట్‌లు లేవు: