10, అక్టోబర్ 2023, మంగళవారం

🦅ఒక కాకి కధ

 🦅ఒక కాకి కధ

         🦅🦅  పూందతి తన్రీకర మహ‌ర్షి భార్య , మహాపతివ్రత.

         🦅

ఒకనాడు తన్రీకర మహర్షి శయనించి వుండగా ఆయన నీడ మాత్రం ఒక అరడుగు దూరాన వుండడం చూసిన పూందతి

తన భర్తకు ఏదో కీడు వాటిల్లబోతున్నదని శంకించింది. 

వేకువజామునే నిద్రలేచిన మహర్షి  నదీస్నానానికి బయలుదేరాడు.  అప్పుడు  పూందతి తన భయాన్ని వ్యక్తపర్చకుండా 

" స్వామీ..  యీ రోజు నేనొక వ్రతాన్ని అనుష్టిస్తున్నాను. అందువలన మీరు

సూర్యాస్తమయం అయ్యేవరకూ నా చెంతనే వుండమని కోరి 

తమ కుటీర ద్వారానికి ఎదురుగా  భక్తితో పూజలు చేయసాగింది.

ప్రక్కనున్న చెట్టుపైని  కాకి ఒకటి  అరవడం మొదలు  పెట్టింది. ఋషిపత్ని తన పూజకు భగ్నం కలుగరాదని  కళ్ళు మూసుకుని మంత్రాలు  పఠించసాగింది.

హఠాత్తుగా కాకి తన అరుపు  ఆపేసింది. కుటీర ప్రాంతం అంతా

నిశ్శబ్దంగా వుండడంతో కళ్ళు తెరచింది పూందతి. భగవంతుని కి నివేదించవలసిన

ప్రసాదాన్ని కాకి తినడం చూసింది.

కోపంతో  పూందతి ఆ 

కాకిని తరుముతూ భర్తను ,  కుటీరాన్ని వదలి బయటకు వచ్చింది.

మహర్షికి  మహాపతివ్రతయైన తన భార్య పూందతి రక్షణ లేకుండాపోయింది.  ఈలోగా కాకిరూపంలో వచ్చిన యమధర్మరాజు 

తన్రీకర మహర్షి ప్రాణాలను తన యమపాశంతో బంధించాడు. భర్తకోసం విలపిస్తున్న పూందతిని యముడు ఓదారుస్తూ

"అమ్మా..మన్నించండి ! విధాత వ్రాతను ఎవ్వరూ తప్పించలేరు. నీ భర్త ఆయుర్దాయం ముగిసింది. అతని ప్రాణాలను నేను తీసుకువెళ్ళ తప్పదు.

వెళ్ళేముందు మీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను.

ఇంక భూలోకంలో, చనిపోయినవారి ఆత్మలకి శాంతి కలిగేలా వారి వారి  బంధువులు నివేదించే ఆహారాన్ని నీవు కాకి రూపంలో తీసుకుని ఆ పితృదేవతలకు  సమర్పిస్తూ  వారి సంతతి పుణ్యం సంపాదించే సత్కార్యం చేస్తూవుండమని ఆదేశించాడు.


యముని వరప్రసాద ఫలితంగా పూందతి యీనాటికి కాకి రూపంలో మరణించినవారి ఆత్మ శాంతికై ఆహారం తీసుకు తింటున్నదని   ప్రజలు ధృఢంగా నమ్ముతారు.🦅

A Best Collection frim Brahmana Samaakya.

🦅🦅🦅🦅🦅

కామెంట్‌లు లేవు: